స్వతంత్ర భారత తొలి ఓటరు.. 102 ఏళ్ల శ్యాం శరణ్ నేగి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది దగ్గరుండి ఆయనను బ్యాండ్‌బాజాతో గౌరవంగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. లోపలకు ఆహ్వానించేందుకు రెడ్‌కార్పెట్ పరిచారు.
ఓటేసిన 'స్వతంత్ర భారత తొలి ఓటరు'
1951లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో భాగస్వామ్యమైన... శ్యాం శరణ్ నేగి ప్రస్తుత సార్వత్రికంలోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా పాఠశాల కేంద్రంలో ఓటు వేశారు. ఆయన రాక కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
శ్యాం నేగి ఓటు వినియోగం
ఓటేసిన అనంతరం సంతోషం వ్యక్తం చేశారు నేగి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేయడానికి 100 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సిబ్బంది నేగిని ప్రశంసించారు. 102 ఏళ్ల వయసులోనూ ఓటేసేందుకు ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసిన ఆయన.. అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 31 సార్లు ఈ ప్రక్రియలో భాగమయ్యారు.