తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కశ్మీర్​కు రక్షణమంత్రి - kashmir

సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ నేడు జమ్ముకశ్మీర్​లో పర్యటించనున్నారు

నేడు కశ్మీర్​కు రక్షణమంత్రి

By

Published : Mar 7, 2019, 7:26 AM IST

కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్​ సరిహద్దులో పాక్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తరచూ భద్రతా దళాల శిబిరాలు,సరిహద్దులోనివాసముంటున్న ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. ఈ తరుణంలో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను నేడుసమీక్షించనున్నారు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​. ఆర్మీ అధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ భద్రతపై చర్చించనున్నారు.

నేడు కశ్మీర్​కు రక్షణమంత్రి

సాంబా జిల్లాలోని ఛక్​లాలా, అఖ్​నూర్ ప్రాంతాల్లోఆర్మీ నిర్మించిన వంతెనలనురక్షణమంత్రి ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు.

పాక్​ ఆర్మీకి భారత్​ హెచ్చరిక

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్​ తమ సైనిక బలగాలను, యుద్ధ పరికాలను మోహరించటంపై భారత ఆర్మీ హెచ్చరించింది. కొన్ని రోజులుగా జనావాసాలే లక్ష్యంగా పాక్‌ ఆర్మీ పదేపదే కాల్పులకు తెగబడుతోంది. రాజౌరీ, నౌషెరా, కృష్ణాఘాట్‌, సుందర్‌బనీ ప్రాంతాల్లో పౌరులు, ఆర్మీ గస్తీ శిబిరాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతోందని అధికారులు తెలిపారు.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోనూ జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాక్‌ ఆర్మీ తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details