తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు ఎన్​డీఏ పక్షాల భేటీ.. ఫలితాలపై సమాలోచనలు - నేతలు

భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్టీల ముఖ్య నేతలు నేడు దిల్లీలో భేటీ కానున్నారు. ఎగ్జిట్​పోల్స్​, రెండు రోజుల్లో వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, భాజపా ముఖ్య నేతల భేటీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది.

భాజపా భేటీ

By

Published : May 21, 2019, 5:35 AM IST

Updated : May 21, 2019, 6:56 AM IST

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా నేడు ఏర్పాటు చేసే విందు సమావేశానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్​డీఏ) భాగస్వామ్య పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఎగ్జిట్​పోల్స్​ అంచనాలు, రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై భేటీలో సమాలోచనలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.

బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే, ఎల్​జేపీ అధినేత రాంవిలాస్​ పాసవాన్​​ తదితర ఎన్డీఏ పార్టీల ముఖ్య నేతలు భేటీలో పాల్గొననున్నారు.

భాజపా నేతల భేటీ

ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికంటే ముందు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యనేతలు పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ కానున్నారు.

ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఈ నెల 17న నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, అమిత్​ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి.

272 లోక్​సభ స్థానాల మెజార్టీ మార్కును ఎన్డీఏ సులువుగా దాటుతుందని అన్ని సంస్థల ఎగ్జిట్​ పోల్స్​ స్పష్టంగా చెప్పాయి.
2014 ఫలితాలే పునరావృతమవుతాయని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థానాలు భాజపాకి వస్తాయని కొందరు నేతలు చెబుతున్నారు. 2014లో భాజపా ఒక్కటే 282 లోక్​సభ స్థానాలను కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి : ఎగ్జిట్​పోల్స్​లో కచ్చితత్వం ఎంత? గతంలో ఏం జరిగింది?

Last Updated : May 21, 2019, 6:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details