తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిర్​ ఇండియా కేసులో ప్రఫుల్​ విచారణ

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఎదుట పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్​ పటేల్​ హాజరయ్యారు. ఎయిర్ ​ఇండియా కుంభకోణంలో హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ ఎన్సీపీ నేత.

ఎయిర్​ఇండియా కేసు

By

Published : Jun 10, 2019, 2:19 PM IST

పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్​ పటేల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఎదుట హాజరయ్యారు. ఎయిర్ ​ఇండియా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో విచారణ కోసం ఇటీవలే సమన్లు జారీచేసింది ఈడీ.

ఇదీ కేసు

లాభాలు వచ్చే రూట్లు, సమయాల్లో ఎయిర్​ ఇండియా విమానాలు తిప్పకుండా చేయడం ద్వారా విదేశీ ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరేలా చేశారన్నది ప్రధాన అభియోగం. ఇందుకు ప్రతిఫలంగా పౌర విమానయాన శాఖ, ఎయిర్​ ఇండియా అధికారులకు ముడుపులు అందాయన్నది ఆరోపణ. ఆ సమయంలో ప్రఫుల్​ పటేల్​ పౌరవిమానయాన శాఖ మంత్రి.

ఎయిర్​ ఇండియాకు తీవ్ర నష్టం మిగిల్చిన ఈ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్​ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. విమానయాన రంగ మధ్యవర్తి దీపక్ తల్వార్​ను ఈ ఏడాది ఆరంభంలో అరెస్టు చేసింది. ప్రఫుల్​తో తల్వార్​ ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ ఉండేవారని అభియోగ పత్రంలో పేర్కొంది ఈడీ.

"ఎయిర్​ ఇండియా ధరకు తగినట్టు.. 2008-09 మధ్య ఎమిరేట్స్, కతార్​, ఎయిర్​ అరేబియాకు అవసరమైన అనుమతులు రాబట్టుకున్నారు తల్వార్​. ఇందుకు ఆ సంస్థలు తల్వార్​కు రూ.272 కోట్లు చెల్లించాయి."

-ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​

ఇదీ చూడండి: కథువా అత్యాచార కేసులో ఆరుగురు దోషులు

ABOUT THE AUTHOR

...view details