ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సల్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అతడిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు.
హురేపాల్, బెచాపల్ లోయ మధ్యలో మంగళవారం ఉదయం రిజర్వ్ గార్డ్స్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూంబింగ్ చేపట్టిన నేపథ్యంలో ఈ కాల్పులు జరిగినట్లు భద్రతా అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం వారు దట్టమైన అడవిలోకి పారిపోయినట్లు పేర్కొన్నారు. ఘటన స్థలంలో చనిపోయిన మావోయిస్టు దుస్తులు దొరికినట్లు దంతేవాడా ఎస్పీ పల్లవ తెలిపారు.