తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిరం ఏర్పాటుకై సుప్రీంకోర్టునే నిర్మించారు..! - ప్రయాగ్​రాజ్​

రాముని జన్మస్థలమైన అయోధ్యలో మందిరం ఏర్పాటుకై దేశవ్యాప్తంగా రామభక్తులు నినదిస్తున్న సమయంలో... రామ మందిరం సమస్యపై తమ వాదనలు వినాలని ఉత్తర్​ప్రదేశ్​లో ఏకంగా సుప్రీంకోర్టునే నిర్మించారు. అయితే.. ఇదంతా నవరాత్రి ఉత్సవాల కోసం. ప్రయాగ్​రాజ్ కుల్దాబాద్​​లోని దుర్గా పూజ పండల్​ కమిటీ... సర్వోన్నత న్యాయస్థానం నమూనాతో మండపాన్ని రూపొందించింది. దుర్గామాతనే తమ గోడు వినాలని.. మందిరం ఏర్పాటుకు ఆదేశించాలని కోరుతున్నారు.

రామమందిరం ఏర్పాటుకై సుప్రీంకోర్టునే నిర్మించారు..!

By

Published : Oct 5, 2019, 5:37 PM IST

రామమందిరం ఏర్పాటుకై సుప్రీంకోర్టునే నిర్మించారు..!

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి విభిన్న ఆకృతుల్లో మండపాలు రూపొందిస్తున్నారు. ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. అయితే... ఉత్తర్​ప్రదేశ్​లో ఇంకాస్త ప్రత్యేకంగా చేయాలనుకున్నారు. రాముని జన్మస్థానం అయోధ్యలో రామమందిర నిర్మాణం కోరుతూ.. న్యాయస్థానంలో తీర్పు తమకు అనుకూలంగా రావాలని ఏకంగా సుప్రీంకోర్టు నమూనానే అమ్మవారికి మండపంలా రూపొందించి... భక్తిని చాటుకున్నారు. ప్రయాగ్​రాజ్​లోని కుల్దాబాద్​లో దుర్గా పూజ పండల్​ కమిటీ ఈ మండపాన్ని తయారుచేసింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదం వాదనలు తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే తీర్పు వస్తోందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాదేవి ఎదుట అత్యున్నత న్యాయస్థానాన్ని రూపొందించారు. ఇందులోనూ వాస్తవ పరిస్థితులకు తగినట్లే న్యాయమూర్తులు, వకీళ్లు, పోలీసులు అందరూ ఉన్నారు. అయితే.. బోనులో మాత్రం మహిషాసుర, భస్మాసురలను ఉంచారు.

పరాశక్తికి ప్రతీక అయిన దుర్గా మాత.. న్యాయమూర్తులకు తగినంత బలం చేకూర్చి అయోధ్యలో రామమందిరం ఏర్పాటుకు కృషి చేస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో మండపాన్ని ఇలా రూపొందించినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. అన్ని అడ్డంకులు తొలగి మంచిరోజులు రావాలని ప్రత్యేక పూజలూ చేస్తున్నారు.

ఇదీ చూడండి:50 కిలోల బంగారు దుర్గమ్మా.. చల్లగా చూడమ్మా..!

ABOUT THE AUTHOR

...view details