తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆత్మనిర్భర్​ భారత్​ సృష్టించడంలో అదే కీలకం'

భారత దేశ విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు నూతన విద్యా విధానం ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. అసోంలోని ఐఐటీ-గువాహటి స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో యువత ఆలోచనలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.

National Education Policy (NEP) will play key role in   creating 'Atmanirbhar Bharat': PM Narendra Modi at IIT(G) convocation.
'ఆత్మనిర్భర్​ భారత్​ సృష్టించడంలో అదే కీలకం'

By

Published : Sep 22, 2020, 1:07 PM IST

అంతర్జాతీయ స్థాయికి భారత విద్యా వ్యవస్థ​ ఎదిగేందుకు నూతన విద్యా విధానం(ఎన్​ఈపీ) ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో శక్తిమంతంగా మారిన విశ్వవిద్యాలయాలు.. విదేశాల్లోనూ తమ క్యాంపస్​ల​ను ఏర్పాటు చేసుకునే విధంగా ఎన్​ఈపీ తోడ్పడుతుందన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​ను సృష్టించడంలో ఎన్​ఈపీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అసోంలోని ఐఐటీ-గువాహటి స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు ప్రధాని మోదీ. విద్యా రంగంలో భారత హోదాను పెంపొందించేందుకు ఐఐటీ-గువాహటి కీలక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

యువత ఆలోచనలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మోదీ తెలిపారు. విద్యార్థులు కన్న కలలను నిజం చేసుకునే క్రమంలోనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఇదీ చూడండి:-ఐరాసలో పాక్​ 'కశ్మీర్​' ప్రస్తావనపై భారత్​ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details