తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాట్​గ్రిడ్​: నిఘాలో సూపర్​ పవర్​గా భారత్​! - MINISTRY OF HOME AFFAIRS

ఉగ్రదాడుల్ని ఆపే కథాంశంతో అనేక సినిమాలు వచ్చాయి. హీరో ఓ కంట్రోల్​ రూమ్​లో కూర్చునే విలన్​ ఏం చేస్తున్నాడో ట్రాక్​ చేస్తుంటాడు. ఏ బ్యాంక్​ నుంచి లావాదేవీలు చేస్తున్నాడు, ఎవరితో ఫోన్​లో మాట్లాడుతున్నాడు, ఏ విమానంలో ఎక్కడికి వెళ్తున్నాడు... అన్నీ ఇట్టే తెలుసుకుంటుంటాడు. నిజ జీవితంలోనూ ఇలా ఒకే ఒక్క క్లిక్​తో తెలుసుకునే వ్యవస్థ కొద్ది నెలల్లో అందుబాటులోకి రానుంది. అదే నాట్​గ్రిడ్.

నాట్​గ్రిడ్​: నిఘాలో సూపర్​ పవర్​గా భారత్​!

By

Published : Sep 22, 2019, 4:34 PM IST

Updated : Oct 1, 2019, 2:23 PM IST

నాట్​గ్రిడ్​: నిఘాలో సూపర్​ పవర్​గా భారత్​!

2020 జనవరి నుంచి నేషనల్​ ఇంటెలిజెన్స్​ గ్రిడ్​(నాట్​గ్రిడ్​) అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. వలసలు, బ్యాంకింగ్​, పన్ను, రైల్వే- విమాన సేవలు తదితర అంశాల సమాచార సేకరణకు ఈ గ్రిడ్​ ఉపయోగపడనుంది.

రూ. 3వేల 400 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఇటీవలే సమీక్షించారు. ఆ తర్వాత నాట్​గ్రిడ్​కు సంబంధించిన పనులు మరింత వేగవంతం అయ్యాయి.

ఎందుకు...? ఎలా...?

26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం ఇలాంటి పటిష్ఠ నిఘా వ్యవస్థ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ గ్రిడ్ ద్వారా ముష్కరుల కదలికలను పసిగట్టి.. ఉగ్రదాడులను నియంత్రించవచ్చు.

నాట్​గ్రిడ్​లో వలసలు, బ్యాంకింగ్​, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్​ కార్డు వినియోగం, టెలికాం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, విమాన- రైల్వే సర్వీసు సహా ఇతర నిఘా వ్యవస్థకు సంబంధించిన డేటా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్​ కోసం ఇప్పటికే ఐటీశాఖ నుంచి దాదాపు 8 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల వివరాలను సేకరించింది కేంద్రం. పౌర విమానయానశాఖ, ఇతర విమానయాన సంస్థల నుంచి ప్రయాణికుల సమాచార సేకరణకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

తొలిదశలో 10 యూజర్​ ఏజెన్సీలు(ఐబీ, సీబీఐ...), 21 సర్వీసు ప్రొవైడర్లు ఈ గ్రిడ్​తో అనుసంధానమవుతారు. మరో దశలో 950 సంస్థలు, రానున్న సంవత్సరాల్లో 1000 కంపెనీలు గ్రిడ్​లో భాగమవుతాయి.

ఇదీ చూడండి:-క్యాబ్​లో కండోమ్​లు తప్పనిసరి... లేదంటే జరిమానా!

Last Updated : Oct 1, 2019, 2:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details