తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేను ఎవరి పేర్లు చెప్పలేదు : మిషెల్ - మిషెల్​

ఈడీ విచారణలో తాను ఎవరి పేర్లు ప్రస్తావించలేదని దిల్లీ కోర్టుకు తెలిపారు  అగస్టా వెస్ట్​లాండ్ ​​ ఒప్పందం మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్​.  రాజకీయ నేతల పేర్లు చెప్పానంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

క్రిస్టియన్​ మిషెల్​

By

Published : Apr 6, 2019, 5:54 AM IST

Updated : Apr 6, 2019, 6:37 AM IST

రాజకీయ ఎజెండా కోసం దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు అగస్టా వెస్ట్​లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం​ మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్. అగస్టా వెస్ట్​లాండ్​ కేసు విచారణ సమయంలో ఈడీకి తాను ఎవరి పేర్లు చెప్పలేదని ఆయన దిల్లీ కోర్టుకు విన్నవించారు.

విచారణ సమయంలో కాంగ్రెస్ నేతల పేర్లను మిషెల్​ చెప్పారని మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఖండిస్తూ దిల్లీ కోర్టును ఆశ్రయించారు మిషెల్​. విచారణ సందర్భంగా మిషెల్​పై అదనపు అభియోగపత్రాన్ని దాఖలు చేసింది ఈడీ.

అభియోగ పత్రం కాపీని ముందుగా మిషెల్‌కు కాకుండా మీడియాకు ఈడీ ఇచ్చిందని ఆరోపించారు ఆయన తరఫు న్యాయవాది అల్జో కె.జోసఫ్. మిషెల్​ ఎవరి పేర్లనూ చెప్పలేదన్నారు. అభియోగ పత్రాన్ని కోర్టు విచారణకు స్వీకరించడానికి ముందే మీడియా చేతికి ఏ విధంగా వెళ్లిందని ప్రశ్నించారు. ఈ కేసు తదుపరి విచారణ శనివారం జరగనుంది.

రక్షణ ఒప్పందానికి సంబంధించి మిషెల్​తో పాటు మరికొంత మందికి 42 మిలియన్​ యూరోలు ముడుపులుగా అందాయని కోర్టుకు ఈడీ గురువారం తెలిపింది.

Last Updated : Apr 6, 2019, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details