తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాం' - మోదీ

ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవటంలో కాంగ్రెస్  పూర్తిగా విఫలమైందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. భాజపా ఆ తప్పు చేయలేదన్నారు. ప్రస్తుతం భారత్​ వైపు చూడాలంటే ఉగ్రవాదులు భయపడుతున్నారని ఉత్తర్​ప్రదేశ్ మురాదాబాద్​ సభలో వ్యాఖ్యానించారు మోదీ.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

By

Published : Apr 14, 2019, 7:58 PM IST

భారత్​లో ఉగ్రదాడులు జరిగితే కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. దాడులు జరిగితే అంతర్జాతీయ వేదికలపై ఆవేదన వ్యక్తం చేయడం మాత్రమే ఆ పార్టీకి తెలుసునని ఎద్దేవా చేశారు. భాజపా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందని ఉత్తరప్రదేశ్​లోని మురాదాబాద్​లో జరిగిన బహిరంగ సభలో స్పష్టం చేశారు ప్రధాని.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"ఉరీలో ఉగ్రవాదులు తప్పు చేశారు. అప్పుడు లక్షిత దాడులతో సమాధానమిచ్చాం. తర్వాత పుల్వామాలో అతి పెద్ద తప్పు చేశారు. వైమానిక దళంతో వాళ్ల ఇళ్లల్లోకి ప్రవేశించి హతమార్చి వచ్చాం. ఇప్పుడు వాళ్లకు అర్థమైంది. మూడో తప్పు చేస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో."

-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: అబ్దుల్లా, ముఫ్తీ ఆటలు సాగనివ్వం: మోదీ

ABOUT THE AUTHOR

...view details