తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శారదా' కేసులో తృణమూల్ నేతలకు సమన్లు - శారదా

బంగాల్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం వ్యవహారంలో పలువురు నేతలకు సమన్లు జారీ చేసింది సీబీఐ. మంత్రి సుబ్రతా ముఖర్జీ సహా పదిమంది నేతలు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది.

శారదా కేసులో తృణమూల్ నేతలకు సమన్లు

By

Published : Aug 29, 2019, 11:46 PM IST

Updated : Sep 28, 2019, 7:43 PM IST

కోల్​కతాలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసులో పలువురు తృణమూల్ నేతలకు సమన్లు జారీ చేసింది సీబీఐ. బంగాల్​ మంత్రి సుబ్రతా ముఖర్జీ, ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్, కోల్​కతా మాజీ మేయర్, ప్రస్తుతం భాజపాలో ఉన్న సోవన్ ఛటర్జీ సహా 10 మంది నేతలకు సమన్లు జారీ చేసింది.

విచారణకు లోక్​సభ స్పీకర్ అనుమతి

ఈ కేసులో ఒక మాజీ సహా ముగ్గురు తాజా ఎంపీలు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాను ఆశ్రయించింది సీబీఐ. ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎంపీలు సౌగత రాయ్, కకోలీ ఘోష్, ప్రసూన్ బెనర్జీ, మాజీ ఎంపీ సువేందు ముఖర్జీలను విచారించేందుకు సీబీఐకి అనుమతించారు స్పీకర్.

ముగ్గురు నేతలు రూ. 5 లక్షలు... ఒక నేత రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్ వీడియోల్లో కనిపించారని పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటివరకు 12 మంది తృణమూల్ నేతలు, ఓ ఐపీఎస్ అధికారిపై కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కశ్మీరే ప్రధాన విదేశీ అజెండా: పాకిస్థాన్

Last Updated : Sep 28, 2019, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details