ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పేరుతో ఏర్పాటైన సామాజిక మాధ్యమాల ఖాతాలన్నీ నకిలీవేనని తేల్చిచెప్పారు అధికారులు. ఆ ఖాతాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భారత మిగ్-21 బైసన్తో పాక్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చినట్లున్న సమాచారం కూడా ఉంది.
నకిలీ ఖాతాలు! - Insta
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ పేరుతో ఉన్న సామాజిక మాధ్యమాల ఖాతాలు నకిలీవని స్పష్టం చేశారు అధికారులు.
అభినందన్ పేరుతో నకిలీ ఖాతాలు
వీటిపై తాజాగా భారత వాయుసేన స్పష్టతనిచ్చింది. వింగ్ కమాండర్ అభినందన్కి సామాజిక మాధ్యమాల్లో(ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విటర్) ఖాతాలే లేవని పేర్కొంది. ఈ మేరకుఓ ట్వీట్ చేసింది. అభినందన్ పేరిట చెలామణి అవుతున్న కొన్ని ఖాతాల జాబితాను పేర్కొంటూ.. ఆ ఖాతాలను అనుసరించొద్దని సూచించింది.