తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ​ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు - corona in nagaland

ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. నాగాలాండ్​లో నేడు తొలి కేసు నమోదైంది. కోహిమా సమీపంలోని దిమాపుర్​కు చెందిన వ్యక్తికి వైరస్​ సోకినట్లు తేలింది.

Nagaland
నాగాలాండ్​ రాష్ట్రంలో తొలి 'కరోనా కేసు' నమోదు

By

Published : Apr 13, 2020, 1:39 PM IST

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నాగాలాండ్​ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. కోహిమా సమీపంలోని దిమాపుర్​కు చెందిన వ్యక్తికి పాజిటివ్​గా తేలినట్లు అధికారులు వెల్లడించారు.

బాధితుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించిన దిమాపుర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు.. అసోం గువాహటిలోని వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లాలని సిఫార్సు చేశారు. అక్కడ వైరస్​ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలినట్లు అసోం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బిశ్వ శర్మ తెలిపారు. అతనికి తబ్లీగీ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం లేదని.. గువాహటి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

కోహిమాలోని పలు ప్రాంతాలతో పాటు, బాధితుడి నివాసం, అతను ముందుగా చేరిన ఆస్పత్రి పరిసరాల్లో ఆంక్షలు విధించింది నాగాలాండ్​ ప్రభుత్వం.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రాలను కరోనా నుంచి కాపాడిన 'పౌర' నిరసనలు!

ABOUT THE AUTHOR

...view details