తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైసూరు: కన్నుల పండువగా జంబూ సవారీ - మైసూరులో ఏనుగుల సవారీ

మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గజరాజులతో సంప్రదాయ జంబూ సవారీ నిర్వంచారు. ఈ వేడుకలను చూడడానికి దేశ, విదేశాల నుంచి భక్తులు, సందర్శకులు లక్షలాదిగా తరలివచ్చారు.

మైసూరు: కన్నుల పండువగా జంబూ సవారీ

By

Published : Oct 8, 2019, 5:29 PM IST

మైసూరు: కన్నుల పండువగా జంబూ సవారీ

కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ వేడుకల్లో గజరాజులతో జంబూ సవారీ కీలకఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన గజరాజుతోపాటు అందంగా ముస్తాబైన మరికొన్ని ఏనుగులు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి.

వందల ఏళ్లుగా ప్రతి సంవత్సరం జరిగే ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు మైసూరు రాజవంశస్థులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. భక్తులు, సందర్శకులు భారీగా మైసూరుకు తరలివచ్చారు.

ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. 8 వేల మంది సిబ్బందిని మోహరించారు. ఏనుగుల సవారీ మార్గం వెంబడి నిఘా కెమెరాల్ని ఏర్పాటుచేశారు.

400 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం

వడయార్ వంశస్థులు మొదటగా శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అయితే 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. ఆ సందర్భంగా దసరా వేడుకలు నిర్వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ వేడుకలు మాత్రం 400 ఏళ్లుగా నిర్విగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి:మరికాసేపట్లో 'రఫేల్'​ అందుకోనున్న రాజ్​నాథ్​

ABOUT THE AUTHOR

...view details