ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందున 12 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ స్థానిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ కుమార్ తివారి, ఐపీసీ సెక్షన్ 395 (దోపిడీ, హింసాత్మక చర్యలు), సెక్షన్ 436 (గృహదహనం)లను పరిగణలోకి తీసుకుని.. ఈ 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు.
సాక్ష్యాలు లేవు..?
2013 సెప్టెంబర్ 7 ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లలో దుండగులు.. ఇషాద్ గ్రామంలోని ఇళ్లకు నిప్పుపెట్టారు. స్థానికుల ఆస్తులపై దోపిడీకి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) 13 మంది అనుమానితులపై ఐపీసీ సెక్షన్ 495, సెక్షన్ 436 ప్రకారం కేసులు నమోదు చేసింది. అయితే సుదీర్ఘంగా ఈ కేసు విచారణ జరిగింది. ఈ లోపు ఓ నిందితుడు మరణించాడు.
ఇప్పుడు ఫిర్యాదుదారు మహమ్మద్ సులేమాన్‌తో సహా ముగ్గురు సాక్షులు సైతం ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా మారినందున నిందుతులను నిర్దోషులుగా విడుదల చేసింది న్యాయస్థానం.
ఇదీ చూడండి: నరేంద్రుడి పాలనకు ఎన్ఆర్ఐలు ఫిదా