తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆత్మహత్య' కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు

police try to arrest arnab
అర్నబ్

By

Published : Nov 4, 2020, 8:34 AM IST

Updated : Nov 4, 2020, 1:02 PM IST

09:24 November 04

రిపబ్లిక్ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్నబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలీబాగ్ పోలీసు బృందం అర్నబ్ గోస్వామిని తన ఇంటి నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే అరెస్టు చేసే క్రమంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని అర్నబ్ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. తనపైనా భౌతిక దాడులకు పాల్పడ్డారని చెప్పారు.

'ఎమర్జెన్సీ గుర్తొస్తోంది'

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అర్నబ్ గోస్వామి అరెస్టును ఖండించారు. అర్నబ్‌ అరెస్టును వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్యానికి నాలుగో పునాదిపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అవమానించాయని మండిపడ్డారు. అర్నబ్‌ను అరెస్టు చేయడమంటే రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు.

అర్నబ్ అరెస్టును కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఖండించారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని దుయ్యబట్టారు. ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు.

తమను వ్యతిరేకించే వారి నోరు మూయించడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నమే ఇది అని ధ్వజమెత్తారు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ మహారాష్ట్ర ప్రభుత్వ వేధింపులపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు.

ఇదీ కేసు!

2018లో అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్​ తన తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. అర్నబ్​కు చెందిన రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

అన్వయ్ కుమార్తె ఆద్న్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసుపై పునర్విచారణ ప్రారంభించినట్లు ఈ ఏడాది మేలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్​ముఖ్ వెల్లడించారు. రిపబ్లిక్ టీవీ బకాయిల చెల్లింపుపై ఇదివరకు అలీబాగ్ పోలీసులు విచారణ చేపట్టలేదని.. అందువల్లే తన తండ్రి, నానమ్మ ఆత్మహత్య చేసుకున్నారని ఆద్న్యా ఆరోపించినట్లు దేశ్​ముఖ్ పేర్కొన్నారు.

08:51 November 04

రిపబ్లిక్ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్నబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి-విచారణకు రిపబ్లిక్ టీవీ సీఎఫ్‌ఓ గైర్హాజరు

ఇదీ చదవండి- టీఆర్​పీ స్కామ్​ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు

08:44 November 04

అర్నబ్ అరెస్టు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని పోలీసులు నిర్బంధించారు. అర్నబ్ ఇంటికెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అర్నబ్​ను బలవంతంగా వ్యానులోకి ఎక్కించుకుపోయినట్లు రిపబ్లిక్ టీవీ దృశ్యాల్లో స్పష్టమైంది.

అయితే పోలీసులు తనపై భౌతిక దాడులకు పాల్పడ్డారని అర్నబ్ గోస్వామి ఆరోపించారు. 

08:23 November 04

నిర్బంధానికి యత్నం

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అర్నబ్​ను నిర్బంధించేందుకు యత్నించారు.

అయితే పోలీసులు తనపై భౌతిక దాడులకు పాల్పడ్డారని అర్నబ్ గోస్వామి ఆరోపించారు.

పోలీసులు వచ్చిన తర్వాత అర్నబ్ ఇంట్లో ఉద్రిక్తత తలెత్తినట్లు తెలుస్తోంది.

Last Updated : Nov 4, 2020, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details