తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోకల్ రైళ్లు షురూ.. వారికి మాత్రమే అనుమతి - Western Railway

లోకల్ రైలు ప్రయాణాలకు పెట్టింది పేరు ముంబయి. లాక్​డౌన్ అమలుతో రెండున్నర నెలలపాటు ఆగిపోయిన లోకల్ రైళ్లను అక్కడ తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. అయితే అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే ప్రయాణించేందుకు వీలు కల్పించారు.

local trains
లోకల్ రైళ్లు షురూ.. వారికి మాత్రమే అనుమతి

By

Published : Jun 15, 2020, 5:42 AM IST

లాక్​డౌన్​తో గత రెండు నెలలుగా మూతపడిన ముంబయి లోకల్ ట్రైన్లు సోమవారం నుంచి లోకల్ ట్రైన్లు పునఃప్రారంభమయ్యాయి. అత్యవసర సేవల సిబ్బంది, వైద్య రంగంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న వారికి ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. లోకల్ రైళ్లను తీసుకొచ్చే అంశమై సమావేశమైన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

గుర్తింపు కార్డు ఉంటేనే..

అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో నెలవారి టికెట్ తీసుకునేందుకు గుర్తింపు కార్డు చూపవలసి ఉంటుంది. స్టేషన్​లోకి వెళ్లేందుకు ముందు ఐడెంటిటీ కార్డు చూపవలసి ఉంటుంది. అనంతరం ఈ-పాస్​ లేదా క్యూఆర్ వస్తుంది. దీని ఆధారంగా రైల్వే స్టేషన్​లోకి అనుమతిస్తారు. భౌతిక దూరం నిబంధనలను పాటించేందుకు వీలుగా ఒక లోకల్ ట్రైన్​లో 700 మంది ప్రయాణికులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆపరేషన్​ దిల్లీ: కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం

ABOUT THE AUTHOR

...view details