అంతర్జాతీయ బహుపాక్షిక విధానం తీవ్ర ప్రమాదంలో ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్.. సంస్కరణలు ప్రసంగాలకే పరిమితం కావద్దన్నారు.
"ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే కొనసాగితే చాలా కష్టం. ఐరాసలో అందరికీ తగిన ప్రాధాన్యం ఉండదు. ముఖ్యంగా 5 శాశ్వత సభ్య దేశాల ఆధిపత్యం కొనసాగితే ఐరాస విశ్వసనీయత తగ్గిపోతుంది. దీన్ని ప్రపంచం ఎంతమాత్రం కోరుకోదు. సంస్కరణలు ప్రసంగాలకే పరిమితం కాకుండా వాటికోసం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది."
- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి