తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకిల్, ఈ-కార్​, మాస్క్​తో ఎంపీల 'ప్రకృతి ప్రేమ' - పార్లమెంట్​లో లోక్​సభ సభ్యుల 'ప్రకృతి' ప్రేమ

దిల్లీలో కాలుష్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌ సాక్షిగా వినూత్న నిరసన చేపట్టారు లోక్​సభ సభ్యులు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్ ముఖానికి ముసుగు ధరించగా, పార్లమెంట్‌కు  సైకిళ్లపై వచ్చారు భాజపా ఎంపీలు మన్సుక్‌ మాండవియా, మనోజ్‌ తివారీ. కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్ విద్యుత్‌ కారులో పార్లమెంట్‌కు వచ్చారు. ఇలా ఎవరికి  వారు పర్యావరణాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చారు.

పార్లమెంట్​లో లోక్​సభ సభ్యుల 'ప్రకృతి' ప్రేమ

By

Published : Nov 18, 2019, 6:07 PM IST

Updated : Nov 18, 2019, 8:10 PM IST

సైకిల్, ఈ-కార్​, మాస్క్​తో ఎంపీల 'ప్రకృతి ప్రేమ'

దిల్లీలో వాయు కాలుష్యంపై పలువురు ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశం ప్రారంభం సందర్భంగా మంత్రులు, లోక్​సభ సభ్యులు మాస్కులు ధరించి, సైకిళ్లు, ఎలాక్ట్రానిక్​ కార్లు నడుపుతూ పార్లమెంట్​ చేరుకున్నారు.

కాలుష్యం పెరుగుదలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహంవద్ద ముసుగు ధరించి.. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్ నిరసన తెలిపారు. కర్భన ఉద్గాగారాలను తగ్గించాలని సందేశమిస్తూ భాజపా నేతలు మన్సుక్‌ మాండవియా, మనోజ్‌ తివారీ సైకిళ్లపై పార్లమెంట్‌కు చేరుకున్నారు.

కేంద్ర పర్యావరణ శాఖామంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ పార్లమెంట్‌కు ఎలక్ట్రిక్‌ కారులో వచ్చారు. విద్యుత్‌ కార్లు పర్యావరణహితమని, ప్రజలు వాటిని వినియోగించి కాలు‌ష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలుపంచుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:హీరోయిన్​కు అస్వస్థత... పార్లమెంట్​ సమావేశాలకు గైర్హాజరు

Last Updated : Nov 18, 2019, 8:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details