హోంవర్క్ చేయలేదని విద్యార్థినిని దారుణంగా శిక్షించాడు ఓ ఉపాధ్యాయుడు. తోటి విద్యార్థులతో ఆరు రోజుల పాటు చెంపదెబ్బలు కొట్టించాడు. మధ్యప్రదేశ్ ఝబువా జిల్లాలోని జవహర్ నవోదయ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదుతో టీచర్ మనోజ్ వర్మను పోలీసుల అరెస్ట్ చేశారు.
ఘటనపై పాఠశాల కమిటీ
గతేడాది జనవరి 1 నుంచి 10 వరకు ఆరోగ్యం బాగోలేక పాఠశాలకు వెళ్లలేదు బాధితురాలు. 11 తేదీన పాఠశాలకు వెళ్లగా హోం వర్క్ చేయనందుకు శిక్షగా 14 మంది తోటి విద్యార్థినులతో ఆరు రోజుల పాటు రెండు చొప్పున చెంపదెబ్బలు కొట్టించాడు వర్మ. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణకు అంతర్గత కమిటీ నియమించారు.