ఆ విద్యార్థి తండ్రి ఓ రైతు. ఆయనది సకాలంలో ఫీజు చెల్లించలేని పరిస్థితి. డబ్బు అందగానే వేధింపుల ప్రిన్సిపాల్‌కు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే వినూత్న ఆలోచనతో బుద్ధి చెప్పాడు. బ్యాంకుకు వెళ్లి ఓ బస్తా చిల్లర తీసుకున్నాడు.
వేధింపులకు చిల్లర గుణ'పాఠం' - చిల్లర
మధ్యప్రదేశ్ దేవాస్ నగరంలోని జ్ఞానసాగర్ అకాడమీ పాఠశాల ప్రిన్సిపాల్ ఫీజుల కోసం పిల్లలను వేధిస్తోంది. ఫీజు కట్టటం ఆలస్యమైన ఓ పిల్లవాడి తండ్రి వేధింపులపై ఊహించని రీతిలో స్పందించాడు. బ్యాంకు నుంచి ఓ బస్తా చిల్లర తెచ్చి ప్రిన్సిపాల్ బల్లపై పోసి ఏరుకోమన్నాడు. ఈ సంఘటనతో ప్రిన్సిపాల్‌కు నోట మాట రాలేదు.
వేధింపులకు చిల్లర గుణ'పాఠం'
నేరుగా ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి ఆమె బల్లపై చిల్లర గుమ్మరించాడు. ఊహించని ఘటనతో ప్రిన్సిపల్‌కు నోట మాట రాలేదు. ఈ ఘటన విద్యాశాఖ ఉన్నతాధికారులకు చేరింది. సదరు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
"ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థి తండ్రికి మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంపై విచారణ చేపట్టాం. సదరు ప్రిన్సిపాల్ తప్పు చేసినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం."-విద్యాశాఖ ఉన్నతాధికారి
Last Updated : Mar 19, 2019, 8:32 PM IST