తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కక్ష సాధింపు కోసమే ఐటీ దాడులు' - it raids

ఆదాయ పన్ను శాఖ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు మధ్యప్రదేశ్ సీఎం కమల్​నాథ్ మాజీ ఓఎస్​డీ ప్రవీణ్​ కక్కడ్​. రెండు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులేవీ లభ్యం కాలేదని స్పష్టం చేశారు.

'కక్ష సాధింపు కోసమే ఐటీ దాడులు'

By

Published : Apr 9, 2019, 7:17 PM IST

ఆదాయ పన్ను శాఖ దాడులపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ఓఎస్​డీ ప్రవీణ్​ కక్కడ్​ స్పందించారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితోనే ఐటీ దాడులు చేశారని ఆరోపించారు. దిల్లీ తుగ్లక్​ రోడ్డులోని ఓ రాజకీయ నేత నివాసానికి, మధ్యప్రదేశ్​కు మధ్య వివిధ లావాదేవీలు జరిగినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్​ సీఎం సన్నిహితుల నుంచి రూ.281 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఐటీ అధికారుల వ్యాఖ్యలతో విభేదించారు ప్రవీణ్ కక్కడ్​. హవాలా రాకెట్​తో తనకే సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐటీ అధికారులు రాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా ప్రవర్తించారన్నారు. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రితో సంబంధాలున్న వ్యక్తులపై ఆదివారం నుంచి 3 రోజుల పాటు 50 ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు ఆదాయ పన్ను అధికారులు.

ప్రవీణ్​ కక్కడ్​ ఆస్తులపై ముగిసిన దాడులు...

ప్రవీణ్​ కక్కడ్​ ఇంటి నుంచి రూ. 48 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగలకు సంబంధించిన పత్రాల్ని ప్రవీణ్​.. అధికారులకు సమర్పించారు. ఐటీ అధికారులకు ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఏ ఆధారాలు లభించలేదు.

అశ్విన్ శర్మ ఇంటిలో పులి చర్మం...!

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ మాజీ ఓఎస్​డీ ప్రవీణ్​ కక్కడ్​ సహాయకుడు అశ్విన్​ శర్మ ఇంటినుంచి వన్యప్రాణుల అవయవాల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జంతువుల తలలతో తయారు చేసిన వస్తువులను సేకరించారు. పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఐటీ అధికారులతో సహా సీఆర్​పీఎఫ్ బలగాలు, భోపాల్ పోలీసులు పాల్గొన్నారు. .

ABOUT THE AUTHOR

...view details