తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శౌచాలయంలో చిన్నారులకు వంట చేస్తే తప్పేంటి?'

మధ్యప్రదేశ్​ కరెరాలోని అంగన్​వాడీ కేంద్రంలో చిన్నారులకు భోజనాన్ని  శౌచాలయంలో వండుతున్నారని  ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర మంత్రి ఇమర్తి దేవి అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

'శౌచాలయంలో చిన్నారులకు వంట చేస్తే తప్పేంటి?'

By

Published : Jul 24, 2019, 11:33 AM IST

మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని శివ్​పురీ జిల్లా కరెరాలోని అంగన్​వాడీ కేంద్రంలో చిన్నారులకు భోజనాన్ని శౌచాలయంలో వండుతున్నారని ఫిర్యాదు అందింది.

ఈ విషయంపై దేవి స్పందించారు. టాయ్​లెట్​లో వంట చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. శౌచాలయం వినియోగంలో లేదని.. వంట చేసేందుకు అందులో చోటు ఉందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత కాలంలో మన ఇళ్లలో కూడా వంటగది పక్కనే శౌచాలయాలు ఉంటున్నాయని.. అంతమాత్రన ఇంటికొచ్చిన బంధువులు భోజనం చేయకుండా వెళ్తే మనమేం చేస్తాం అన్నారు దేవి. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

ఇదీ చూడండి: కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

ABOUT THE AUTHOR

...view details