తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గన్​ లైసెన్స్ కావాలంటే మొక్కలు నాటాల్సిందే'

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో గన్​ లైసెన్స్​ మంజూరు చేయడానికి ఓ వినూత్న నిబంధన అమలులోకి తెచ్చారు అధికారులు. మొక్కలు నాటి సెల్ఫీ తీసుకున్నవారికే లైసెన్స్​లు జారీచేస్తున్నారు. తక్షణ ప్రాణహాని ఉన్నవారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.

'గన్​ లైసెన్స్ కావాలా...మొక్కలు నాటి సెల్ఫీ తీసుకోండి'

By

Published : Jun 2, 2019, 7:57 PM IST

మీకు గన్​ లైసెన్స్​ కావాలా? అయితే మొక్కలునాటి సెల్ఫీ తీసుకోవాల్సిందే. మీరు విన్నది నిజమే. తుపాకులంటే ఎంతో మోజు పడే..... మధ్యప్రదేశ్​లోని చంబల్ ప్రాంతంలో కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధన ఇది.

"గన్​ లైసెన్స్​ కావాలనుకునేవారు కనీసం 10 మొక్కలను నాటాలి. సొంత భూమి లేకపోతే రెవెన్యూ అధికారులు సూచించిన ప్రభుత్వ భూమిలో మొక్కలు నాటాలి."-అనురాగ్​ చౌదరి, గ్వాలియర్​ కలెక్టర్​

సెల్ఫీ తీసుకుంటే సరిపోదు..

గన్​ లైసెన్స్​ కావాలనుకునే వారు కేవలం మొక్క నాటి సెల్ఫీ తీసుకుంటే సరిపోదు. ఒక నెలపాటు ఆ మొక్కను సంరక్షించి మళ్లీ సెల్ఫీ తీసుకోవాలి. వీటిని దరఖాస్తుతో పాటు జతచేయాలి. స్థానిక ప్రభుత్వ అధికారి (పట్వారీ) నిబంధనలు పాటించిందీ లేనిదీ పరిశీలించి నిర్ధారిస్తారు.

తక్షణ ప్రాణహాని ఉంటేనే..

తక్షణ ప్రాణహాని ఉన్నవారికి మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. వీరు కూడా గన్​ లైసెన్స్​ పొందిన తరువాత తప్పక మొక్కలు నాటాల్సి ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణ కోసం...

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గ్వాలియర్​ కలెక్టర్​ అనురాగ్​ చౌదరి స్పష్టం చేశారు. గన్​ లైసెన్స్​కు అమలు చేస్తున్న ఈ నిబంధనే..పెట్రోల్​ పంపుల లైసెన్స్​లకూ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: యోగా మహోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ'

ABOUT THE AUTHOR

...view details