తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇమార్తీ దేవీకి ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం - మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారం

ఒక రోజు పాటు(నవంబర్ 1న) ప్రచారం నిర్వహించకుండా మధ్యప్రదేశ్ భాజపా మంత్రి ఇమార్తీ దేవీపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలకు ఈరోజుతోనే ప్రచారం ముగియనుంది.

MP bypoll: BJP candidate Imarti Devi barred from campaigning for one day
ఇమార్తీ దేవీకి ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం

By

Published : Nov 1, 2020, 9:21 AM IST

మధ్యప్రదేశ్ భాజపా అభ్యర్థి, ఆ రాష్ట్ర మంత్రి ఇమార్తీ దేవీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఒకరోజు పాటు ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 1న ఈ ఆదేశాలు అమలు అవుతాయని వెల్లడించింది.

ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్థితో పాటు వారి కుటుంబంలోని మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇమార్తీ దేవీకి మంగళవారమే నోటీసులు జారీ చేసింది ఈసీ. దీనిపై వివరణ ఇచ్చిన ఇమార్తీ.. ఆరోపణలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇమార్తీ ఉల్లంఘించారని పేర్కొంది.

మధ్యప్రదేశ్​లో జరగనున్న 28 అసెంబ్లీ ఎన్నికల బైపోలింగ్​కు ప్రచారం నవంబర్ 1తోనే ముగియనుండటం గమనార్హం.

వివాదాస్పద ప్రచారాలు!

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను ఈసీ ఇదివరకే రద్దు చేసింది. పదేపదే నియమావళిని ఉల్లంఘించడం కారణంగా పేర్కొంది. అంతకుముందు ఇమార్తీ దేవీ లక్ష్యంగానే కమల్​నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం వివాదాస్పదమైంది.

ఇదీ చదవండి:

కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలపై దుమారం

'ఆమె పేరు గుర్తుకురాకే అలా అన్నాను'

ABOUT THE AUTHOR

...view details