తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎల్​ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత - ఎల్​ఓసీ

గత నెల 30న.. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను భారత సైన్యం గుర్తించింది. యుద్ధ సామాగ్రిని దుండగులు పాకిస్థాన్​ నుంచి భారత్​కు అక్రమంగా తరలిస్తున్నట్టు సైన్యం అనుమానించి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఆయుధాలను తాజాగా స్వాధీనం చేసుకుంది.

movement of suspicious persons detected along the Line of Control in Baramulla district
ఎల్​ఓసీ వెంబడి అనుమానాస్పద కదలికలు- అందుకేనా?

By

Published : Sep 1, 2020, 3:29 PM IST

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని రామ్​పుర్​ సెక్టర్​ వద్ద ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కొందరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో తిరుగుతుండటాన్ని భారత సైన్యానికి చెందిన చినార్​ కార్ప్స్​ గుర్తించింది. గత నెల 30న జరిగిన ఈ ఘటనలో.. సరిహద్దుకు దగ్గరల్లో ఉన్న ఓ గ్రామం నుంచి దుండగులు భారత భూభాగంలోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

ఎల్​ఓసీ వెంబడి అనుమానాస్పద కదలికలు- అందుకేనా?

యుద్ధానికి ఉపయోగపడే సామాగ్రి, పరికరాలను.. ఎల్​ఓసీ వెంబడి ఉండే గుర్తుతెలియన స్థావరాల్లో వదిలి వేయడం వీరి పనిగా సైన్యం భావించి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో తుపాకులను స్వాధీనం చేసుకుంది సైన్యం.

ఆయుధాలు పెట్టి ఉన్న ప్రాంతం
ఆయుధాలు పెట్టి ఉన్న ప్రాంతం
సైన్యం స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

పాకిస్థాన్​ సైన్యం సహాయంతోనే జమ్ముకశ్మీర్​లోకి ఆయుధాలను అక్రమంగా తరలించేందుకు ఉగ్రమూకలు చేస్తున్న దుశ్చర్యలకు ఈ తాజాగా ఘటన అద్దంపడుతోందని చినార్​ కార్ప్స్​ వెల్లడించింది. వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎల్​ఓసీ వెంబడి పటిష్ట భద్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:-యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'

ABOUT THE AUTHOR

...view details