తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొడుకు మృతదేహం మోస్తూ 4 కి.మీ నడక - ఉత్తరప్రదేశ్​

తొమ్మిదేళ్ల కొడుకు మృతదేహాన్ని తల్లి మోసుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్​ షాజహాన్​పూర్​లో జరిగింది. ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్​ ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు భిన్నంగా స్పందించాయి. తమ వద్ద ఉన్నప్పుడు రోగి బతికే ఉన్నాడని చెప్పాయి.

తొమ్మిదేళ్ల కొడుకు మృతదేహం మోస్తూ 4 కి.మీ నడక

By

Published : May 28, 2019, 2:16 PM IST

Updated : May 28, 2019, 3:23 PM IST

కొడుకు మృతదేహం మోస్తూ...

ఉత్తరప్రదేశ్​లోని షాజహాన్​పుర్​లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల కొడుకు మృతదేహాన్ని ఒడిలో ఎత్తుకుని నాలుగు కిలోమీటర్లు నడిచింది ఓ తల్లి.

అంబులెన్స్​ నిరాకరించడం వల్లే!

తొమ్మిదేళ్ల అఫ్రోజ్​ తల్లిందండ్రులు షాజహాన్​పూర్​లోని సదర్​ బజార్​వాసులు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని షాజహాన్​పూర్​ జిల్లా అసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అందుకు అవకాశం లేకుండానే... అఫ్రోజ్ జిల్లా ఆసుపత్రిలోనే​ మృతిచెందాడు.

పేదరికంలో జీవిస్తున్న అఫ్రోజ్​ తల్లిదండ్రులకు అంబులెన్స్​ సేవలు వినియోగించుకునే అంత స్తోమత లేదు. ఉచితంగా అంబులెన్స్​ సమకూర్చాలని తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందిని అభ్యర్థించారు. కానీ వారు నిరాకరించారు. ప్రత్యామ్నాయం లేక కంటతడి పెట్టుకుంటూ తనయుడి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు మోసుకెళ్లింది ఆ మాతృమూర్తి.

ఆస్పత్రి వర్గాల వాదన...

ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. తమ వద్ద ఉన్నప్పుడు రోగి బతికే ఉన్నాడని... వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించి ఉండొచ్చన్నారు.

"అప్పటికే బాలుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. లఖ్​నవూలోని పెద్దాసుపత్రిలో చేర్చాలని సూచించాం. వేరే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తామని బాలుడి తల్లిదండ్రులన్నారు. రోగి దారిలోనే మరణించి ఉండొచ్చు. ఘటన తర్వాత మృతుడి బంధువులు మా వద్దకు రాలేదు."
--- అనురాగ్​ పరాసర్​, అత్యవసర విభాగ వైద్యాధికారి.

Last Updated : May 28, 2019, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details