తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లోక్​సభ సమావేశాల ఆల్​టైమ్​ రికార్డ్​' - అత్యంత ఉత్పాదకత

17వ లోక్​సభ తొలి సమావేశాలు అత్యంత ఉత్పాదకతతో నడిచాయని స్పీకర్​ ఓం బిర్లా హర్షం వ్యక్తం చేశారు. 1952 నుంచి ఇప్పటి వరకు నడిచిన పరిపూర్ణ సభగా అభివర్ణించారు. 37 రోజుల్లో 280 గంటల పాటు నడిచిన సభలో.. 36 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు.

'లోక్​సభ సమావేశాల ఆల్​టైమ్​ రికార్డ్​'

By

Published : Aug 7, 2019, 10:21 AM IST

లోక్​సభ సమావేశాలు రికార్డు స్థాయిలో నడిచాయని కొనియాడారు స్పీకర్​ ఓం బిర్లా. 1952 నుంచి ఇప్పటివరకు 17వ లోక్​సభ తొలి సమావేశాలు అత్యంత ఉత్పాదకత సమావేశాలుగా అభివర్ణించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు.

పార్లమెంట్ సమావేశాలు జూన్​ 17న ప్రారంభమయ్యాయి. జులై 26తో ముగించాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. కొన్ని కీలక బిల్లులు ఆమోదింపజేసేందుకు సభను ఆగస్టు 7 వరకు పొడిగించారు.

36 బిల్లులకు ఆమోదం..

లోక్​సభ సమావేశాలు 37 రోజుల్లో 280 గంటల పాటు నడిచాయి. ఇందులో 36 బిల్లులు ఆమోదం పొందాయి. మరో 33 బిల్లులు సభ ముందుకు వచ్చాయి. సాయంత్రాల్లోనూ సుమారు 75 గంటల పాటు సభ అదనంగా నడిచింది. శూన్యకాల సమయంలో 1,086 సమస్యలు లేవనెత్తారు సభ్యులు. ఇందులో 229 మంది తొలిసారి ఎన్నికైన వారే మాట్లాడారు​. 42 మంది మహిళా ఎంపీలు సమస్యలపై గళమెత్తారు.

కీలక బిల్లులు...

లోక్​సభ సమావేశాల్లో ముమ్మారు తలాక్​, పోక్సో చట్ట సవరణ, వినియోగదారుల రక్షణ, ఎన్​ఎంసీ, దివాలా చట్ట సవరణ, జమ్ముకశ్మీర్​ హోదా, విభజన వంటి కీలక తీర్మానాలు, బిల్లులకు ఆమోదం లభించింది.

ఇదీ చూడండి: నిఘా నీడలో కశ్మీర్​.. స్తంభించిన జనజీవనం

ABOUT THE AUTHOR

...view details