తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పారికర్​కు గోవా ప్రజల ఘననివాళి - గోవా

దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ పార్థివదేహాం భాజపా కార్యాలయానికి చేరుకుంది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.

గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌

By

Published : Mar 18, 2019, 11:38 AM IST

భాజపా కార్యాలయానికి పారికర్​ పార్థివదేహం
గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పార్థివదేహాం పనాజీలోని భాజపా ప్రధాన కార్యాలయం చేరుకుంది. తమ ప్రియతమ నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ పార్టీ కార్యాలయానికి చేరుకుని పారికర్​కు నివాళులర్పించారు.

పార్టీ కార్యాలయంలో ఒక గంట పాటు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అక్కడి నుంచి ప్రజల సందర్శనార్థం 'కాలా అకాడమీ'కు తరలిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పారికర్​ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. పనాజీలోని మీరమర్​లో ప్రభుత్వ లాంఛనాలతో పారికర్​ అంత్యక్రియలు జరుగుతాయి.

హాజరుకానున్న భాజపా అగ్రనేతలు

సాయంత్రం మీరమర్​లో నిర్వహించే అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details