'ఎల్నినో'(భూమధ్యరేఖకు సమీపంలో పసిఫిక్ మహాసముద్రం ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం సాధారణ స్థితికి మించి ఉండటం) ప్రభావమే ఇందుకు ప్రధాన కారణమని స్కైమెట్ సీఈఓ జతిన్ సింగ్ వివరించారు. 1951 నుంచి 2000 సంవత్సరం వరకు సాధారణ వర్షపాతం 89 సెంటీమీటర్లుగా నమోదైంది. అయితే ఈ ఏడాది అంతకంటే తక్కువ వర్షమే కురవనుందని జతిన్ తెలిపారు.
వచ్చే వర్షాకాలం గడ్డుకాలమే: స్కైమెట్ - El Nino
దేశవ్యాప్తంగా ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. ఇందుకు 'ఎల్నినో' ప్రభావమే ప్రధాన కారణమని స్కైమెట్ సీఈఓ జతిన్ సింగ్ ప్రకటించారు.
వచ్చే వర్షాకాలం గడ్డుకాలమే: స్కైమెట్
2019లో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో(ఎల్పీఏ) 93 శాతమే నమోదు కానుంది. ఎల్పీఏలో 90-95 శాతం మధ్యలో వర్షపాతం కురవటమంటే అది లోటు వర్షపాతం పరిధిలోకే వస్తుందని స్కైమెట్ ప్రకటించింది.
Last Updated : Apr 3, 2019, 5:54 PM IST