చంద్రుడి విశేషాలు తెలుసుకోవాలనేది భారత్ చిరకాల స్వప్నం. ఈ దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-2 ప్రాజెక్టును చేపడుతోంది. సోమవారం తెల్లవారుజామున జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది.
చంద్రయాన్-2 కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది ఇస్రో. జీఎస్ఎల్వీ విడిభాగాలను పుణెలోని వాల్చంద్ నగర్ సంస్థ తయారు చేసింది. రాకెట్ దిశను నిర్ణయించే నాజల్ కంట్రోల్ టాంకేజ్ సహా బూస్టర్లను వాల్చంద్ నగర్ పరిశ్రమలోనే తయారు చేశారు.