తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం - మోదీ

17వ లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​ నూతన ఎంపీలతో ప్రమాణం చేయించారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం

By

Published : Jun 17, 2019, 11:13 AM IST

Updated : Jun 17, 2019, 2:41 PM IST

17వ లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యులుగా ఘనవిజయం సాధించారు నరేంద్ర మోదీ. ప్రొటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​ ప్రమాణ స్వీకార ప్రక్రియ నిర్వహించారు.

ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణం

ప్రమాణ స్వీకారం సందర్భంగా.. ప్రొటెం స్పీకర్​ మోదీ పేరు పిలవగానే ఎన్డీఏ నేతలంగా 'మోదీ మోదీ'... 'భారత్​ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.

నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి గెలుపొంది.. పార్లమెంటులో అడుగుపెట్టారు ప్రధాని.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు తిరుగులేని విజయం అందించారు మోదీ. ఎన్డీఏ 353 స్థానాల్లో గెలుపొందగా.. భాజపాకే సొంతంగా 303 ఎంపీలున్నారు.

Last Updated : Jun 17, 2019, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details