తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అందరి పార్టీగా భాజపా- అభివృద్ధే కారణం' - foundation day

భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. 39 ఏళ్ల ప్రస్థానంలో వారి పాత్ర ఎంతో కీలకమైందని గుర్తుచేశారు. సంవత్సరాది పండుగ జరుపుకుంటున్న పలు రాష్ట్రాలకు శుభాకాంక్షలు చెప్పారు.

నరేంద్రమోదీ

By

Published : Apr 6, 2019, 10:28 AM IST

Updated : Apr 6, 2019, 3:51 PM IST

మోదీ ట్వీట్
39వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కీలకంగా మారేందుకు సహకరించిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. పార్టీ 39వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

"సమాజ సేవ, దేశాభివృద్ధే లక్ష్యంగా 39 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. దేశంలో కీలక పార్టీగా ఎదిగేందుకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. వాళ్లందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

సమాజంలోని అన్ని వర్గాలను భాజపా సమానంగా ఆదరించిందని స్పష్టం చేశారు మోదీ. పార్టీ మరోసారి అధికారం చేపట్టేందుకు కార్యకర్తలు మరింత కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మోదీ ట్వీట్
మోదీ ట్వీట్
మోదీ ట్వీట్

" ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి.. రెండింటి కలయికతో ముందుకు సాగాం. క్షేత్రస్థాయి ఉండి ప్రజల ముందు నిలిచింది భాజపా. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పార్టీ పోరాడింది.

భాజపా కుటుంబం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు రేయింబవళ్లు కృషి చేస్తుంది. మా మిత్రపక్షాల సాయంతో మళ్లీ మేమే గెలుస్తాం. ఈ ఐదేళ్లలో ఎంతో చేశాం. దేశానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది."
-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

నూతన సంవత్సరాదిని జరుపుకుంటున్న పలు రాష్ట్రాల ప్రజలకు ఆయా స్థానిక భాషల్లో శుభాకాంక్షలు తెలిపారు మోదీ.

మోదీ ట్వీట్

1977లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో కలిసి జనతా పార్టీని జన్​సంఘ్ నేతలు ఏర్పాటు చేశారు. అందులో నుంచి విడిపోయి 1980లో భాజపాను స్థాపించారు. 1984లో మొదటి సారి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసిన భాజపా.. రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది.

ఇదీ చూడండి: తొలిదశకు 3రోజుల ముందు భాజపా మేనిఫెస్టో!

Last Updated : Apr 6, 2019, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details