జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ మహాబలిపురానికి చేరుకున్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతలు స్థానికంగా ఉన్న చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లారు.
ఈ పర్యటనలో తమిళనాడు సంప్రదాయ పంచెకట్టులో మోదీ మెరిశారు. పల్లెటూరి రైతు శైలిలోని కండువా ధరించారు. మరోవైపు జిన్‌పింగ్ కూడా సాధారణ దుస్తుల్లో కనిపించారు.
మొదటగా ఏడో శతాబ్దంలో నిర్మించిన అర్జున పెనాన్స్ను దర్శించారు. అక్కడి చారిత్రక ప్రాశస్త్యాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. అక్కడి నుంచి నిర్మించిన పంచ రథాలను దర్శించుకున్నారు. అక్కడే ఇరు దేశాధినేతలు కొబ్బరినీళ్లు తాగుతూ కాసేపు సేదతీరారు. ఆ తర్వాత షోర్ ఆలయానికి చేరుకున్న మోదీ, జిన్‌పింగ్‌కు విదేశాంగ మంత్రి జయ్శంకర్, భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్వాగతం పలికారు. ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఇరు నేతలు వీక్షించారు.
పల్లవ రాజులు నిర్మించిన ఈ కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది.
ఇదీ చూడండి: కశ్మీర్లో మళ్లీ పోస్ట్‌పెయిడ్ మొబైళ్ల ట్రింగ్ట్రింగ్