ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 6న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో మోదీ మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు.
10 వేల విద్యార్థులతో...
పంచకోశి మార్గంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు భాజపా తెలిపింది. ఈ కార్యక్రమంలో దాదాపు 10వేల మంది విద్యార్థులు పాల్గొంటారని స్పష్టం చేసింది.