కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మోదీని తాను ప్రేమిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుణేలో విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
"నేను నరేంద్ర మోదీని ప్రేమిస్తున్నాను. నిజంగా చెప్తున్నా ఆయనపై నాకెలాంటి కోపం కానీ ద్వేషం కానీ లేవు. ఆయనకే నాపై కోపం ఉంది. ఏం ఫర్వాలేదు. ఇక్కడ చిన్న తేడా ఉంది. ఆయన ఇలా ఆలోచించలేరు." -రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభా ప్రాంగణం మొత్తం మోదీ.. మోదీ అంటూ అరిచారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ వారిని వారించలేదు. నాకు ఏం ఫర్వాలేదు. మీ పైనా నాకు కోపం లేదని బదులిచ్చారు.