ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేతిలోంచి పార్టీ పగ్గాలు చేజారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతికూల పరిస్థితులున్నాయని తెలిసే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయట్లేదని మోదీ అన్నారు.
ఎన్సీపీ పగ్గాలు పవార్ చేజారుతున్నాయి:మోదీ - CONGRESS
ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ తనను 'శౌచాలయ చౌకీదార్' అని చేసిన విమర్శలపై స్పందించారు మోదీ. వారు చేసే విమర్శలే తనకు ఆభరణాలవుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఎన్సీపీ పగ్గాలు పవార్ చేజారుతున్నాయి:మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వర్ధాలో భాజపా నిర్వహించిన బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు. 'శౌచాలయ చౌకీదార్' అని ప్రతిపక్షం చేసిన విమర్శలపై స్పందించారు. దేశంలో మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతను గర్వంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల విమర్శలే తనకు ఆభరణాలన్నారు మోదీ.