తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బడ్జెట్​... నవభారతానికి మార్గసూచీ' - బడ్జెట్​

ఉత్తరప్రదేశ్​ వారణాసిలో 'భాజపా సభ్యత్వ నమోదు' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం తన ప్రసంగంలో బడ్జెట్​ను ప్రస్తావించిన మోదీ... 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తామని పునరుద్ఘాటించారు.

5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థను సాధిస్తాం: మోదీ

By

Published : Jul 6, 2019, 1:39 PM IST

Updated : Jul 6, 2019, 2:46 PM IST

నవభారత్​ దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ​ఉత్తరప్రదేశ్​లోని సొంత నియోజకవర్గం వారణాసిలో ఏర్పాటు చేసిన పార్టీ 'సభ్యత్వ నమోదు' కార్యక్రమంలో బడ్జెట్​ గురించి ప్రస్తావించారు ప్రధాని. 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ఛేదిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.

5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థను సాధిస్తాం: మోదీ

"భారత్​ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్​ డాలర్ల వ్యవస్థగా తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఇందు కోసం ఎంతో శ్రమిస్తున్నాం. ఆర్థికవ్యవస్థ రూపురేఖలు ఎంత పెద్దగా ఉంటే... దేశాభివృద్ధి అంత గొప్పగా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని ఛేదించగలిగే దిశను మేము బడ్జెట్​లో చూపించాం. ఐదేళ్లలో ఒక ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉండగలదో ప్రజలకు నిరూపించాం. రానున్న 10 ఏళ్లకు సంబంధించిన ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నామని ప్రజల్లో విశ్వాసం కల్పించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వారందరూ నిరాశావాదులు...

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ప్రధాని తప్పుపట్టారు. అసాధ్యమన్న వారిని మోదీ విమర్శించారు. వారందరూ నిరాశావాదులని విమర్శించారు.

సభ్యత్వ నమోదుతో పార్టీకి మరింత బలం...

అంతకముందు భాజపా వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్​ ముఖర్జీ 118వ జయంతి సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. కాశీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రక్రియ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పారు.ఇదీ చూడండి:- వారణాసిలో ప్రధాని మోదీ హరితహారం

Last Updated : Jul 6, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details