రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోదీతో సహ 58 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులందరికి రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.
నమో 2.0 : ప్రధాని, మంత్రుల ప్రమాణ స్వీకారం - ప్రధాన మంత్రి
2019-05-30 21:10:03
అట్టహాసంగా ముగిసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం
2019-05-30 21:03:55
కేంద్ర మంత్రులుగా 58 మంది
కేంద్ర మంత్రులుగా మొత్తం 58 మంది ప్రమాణం చేశారు. 25 మంది కేంద్ర మంత్రులుగా, స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా తొమ్మిది మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు.
2019-05-30 21:00:27
కేంద్ర మంత్రిగా దేబొశ్రీ చౌదరి
కేంద్ర మంత్రిగా దేబొశ్రీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు.
- స్వస్థలం: కోల్‌కతా
- పశ్చిమ బంగాల్ భాజపా ప్రధాన కార్యదర్శి
- 2019లో రాయ్‌గంజ్ నుంచి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 20:58:00
కేంద్ర మంత్రిగా కైలాశ్ చౌదరీ
కేంద్ర మంత్రిగా కైలాశ్ చౌదరీ ప్రమాణ స్వీకారం చేశారు.
- స్వరాష్ట్రం: రాజస్థాన్
- నియోజకవర్గం: బాడ్‌మెర్
- 2013లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నిక
- 2019లో లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 20:54:19
కేంద్ర మంత్రిగా రామేశ్వర్ తెలీ
కేంద్ర మంత్రిగా రామేశ్వర్ తెలీ ప్రమాణ స్వీకారం
- జననం: 1970 ఆగస్టు 14
- స్వస్థలం: అసోం
- 2001లో తొలిసారి అసోం శాసనసభకు ఎన్నిక
- 2006లో రెండోసారి అసోం శాసనసభ ఎన్నికల్లో విజయం
- 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 20:50:39
కేంద్ర మంత్రిగా సోం ప్రకాశ్
కేంద్ర మంత్రిగా సోం ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు.
- స్వస్థలం: పంజాబ్
- నియోజకవర్గం: హోషియార్‌పూర్
- 2019 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 20:44:52
కేంద్ర మంత్రిగా నిత్యానంద్ రాయ్
కేంద్ర మంత్రిగా నిత్యానంద్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: జనవరి 1, 1966
- స్వరాష్ట్రం: బిహార్
- 2014లో ఉజియార్‌పుర్ నుంచి లోక్‌సభకు ఎన్నిక
- 2016లో బిహార్ భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు
2019-05-30 20:42:35
కేంద్ర మంత్రిగా సురేశ్ అంగాడి
కేంద్ర మంత్రిగా సురేశ్ అంగాడి ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: జూన్ 1, 1955
- స్వరాష్ట్రం: కర్ణాటక
- నియోజకవర్గం: బెళగావి
- విద్యాభ్యాసం: లా
- 2004, 2009, 2014, 2019లో లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 20:38:38
కేంద్ర మంత్రిగా అనురాగ్ ఠాకూర్
కేంద్ర మంత్రిగా అనురాగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1974 అక్టోబర్ 24
- స్వస్థలం: హమిర్‌పూర్, హిమాచల్‌ప్రదేశ్
- విద్యార్హతలు: బీఏ
- దేశవాళి క్రికెట్ ఆటగాడు
- 2015లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు
- సైన్యంలో పని చేసిన అనుభవం
- హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 20:35:39
కేంద్ర మంత్రిగా సంజీవ్ బాల్యన్
కేంద్ర మంత్రిగా సంజీవ్ బాల్యన్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: జూన్ 23, 1972
- స్వస్థలం: ముజఫర్‌నగర్ జిల్లా, ఉత్తర్‌ప్రదేశ్
- విద్యాభ్యాసం: హరియాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, డాక్టరేట్
- ఉద్యోగం: అసిస్టెంట్ ప్రొఫెసర్
- 2014, 2019లో లోక్‌సభకు ఎన్నిక
- 2014 మేలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు
2019-05-30 20:34:40
కేంద్ర మంత్రిగా బాబుల్ సుప్రియో
కేంద్ర మంత్రిగా బాబుల్ సుప్రియో ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1970 డిసెంబర్ 15
- స్వస్థలం: ఉత్తరపరా, పశ్చిమ బెంగాల్
- విద్యార్హతలు: బీకామ్
- పలు చిత్రాలకు నేపథ్య గానం
- 2014 ఏడాది అసన్‌సోల్ నుంచి లోక్‌సభకు ఎన్నిక
- 2014 నుంచి పలు శాఖలకు సహాయ మంత్రిగా సేవలు
- 2019లో తృణమూల్ అభ్యర్థి మూన్‌మూన్‌సేన్‌పై గెలుపు
2019-05-30 20:30:57
కేంద్ర మంత్రిగా సాధ్వి నిరంజన్ జ్యోతి
కేంద్ర మంత్రిగా సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రమాణ స్వీకారం
- జననం: 1967
- మత ప్రబోధకురాలు
- 2014లో ఫతేపూర్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2014 నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి
2019-05-30 20:30:01
కేంద్ర మంత్రిగా రాందాస్ ఆటవలే
కేంద్ర మంత్రిగా రాందాస్ ఆటవలే ప్రమాణ స్వీకారం చేశారు.
- రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ)
- జననం: 1959, డిసెంబర్ 25
- స్వస్థలం: ఆగల్‌గావ్, సంగ్లి జిల్లా, మహారాష్ట్ర
- 1990లో మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక
- 1999, 2004లో లోక్‌సభకు ఎన్నిక
- 2014లో రాజ్యసభకు ఎన్నిక
- 2016లో కేంద్రమంత్రి పదవి
2019-05-30 20:27:57
కేంద్ర మంత్రిగా పురుషోత్తం రూపాలా
కేంద్ర మంత్రిగా పురుషోత్తం రూపాలా ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1954 అక్టోబర్ 1
- స్వస్థలం: గుజరాత్
- విద్యార్హతలు: బీఎస్సీ, బీఈడీ
- 1988లో భారతీయ జనతాపార్టీలో చేరిక
- మూడుసార్లు గుజరాత్ శాసనసభకు ఎన్నిక
- గుజరాత్ సాగునీటిశాక మంత్రిగా సేవలు
- 2008లో తొలిసారి రాజ్యసభకు ఎన్నిక
- 2016లో రెండోసారి రాజ్యసభకు ఎన్నిక
- 2016లో పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి సేవలు
- 2017లో వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా నియామకం
2019-05-30 20:24:21
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1964 మే 15
- స్వస్థలం: రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
- విద్యార్హతలు: సీఐటీడీ నుంచి టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా
- 2002-2005 మధ్య బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు
- 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నిక
- 2009, 2014లో అంబర్‌పేట్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక
- తెలంగాణలో భాజపా తొలి అధ్యక్షుడు
2019-05-30 20:22:41
కేంద్ర మంత్రిగా కృష్ణ పాల్ గుజ్జర్
కేంద్ర మంత్రిగా కృష్ణ పాల్ గుజ్జర్ ప్రమాణ స్వీకార చేశారు.
- జననం: ఫిబ్రవరి 4, 1957
- స్వస్థలం: ఫరీదాబాద్, హరియాణా
- విద్యాభ్యాసం: లా డిగ్రీ
- 1996, 2009లో హరియాణా అసెంబ్లీకి ఎన్నిక
- 2014, 2019లో లోక్‌సభకు ఎన్నిక
- 2014లో కేంద్రమంత్రిగా బాధ్యతలు
2019-05-30 20:18:39
కేంద్ర మంత్రిగా వి.కె.సింగ్
కేంద్ర మంత్రిగా వి.కె.సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1951 మే 10
- స్వస్థలం: పంజాబ్
- విద్యార్హతలు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ
- భారత సైన్యంలో వివిధ హోదాల్లో సేవలు
- 2010 నుంచి 2012వరకు సైన్యాధ్యక్షుడిగా విధులు
- 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2014 నుంచి విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి
2019-05-30 20:17:25
కేంద్ర మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్
కేంద్ర మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: డిసెంబర్ 20, 1954
- స్వస్థలం: బికానెర్, రాజస్థాన్
- వృత్తి: సివిల్ సర్వెంట్
- 2009, 2014, 2019లో లోక్‌సభకు ఎన్నిక
- 2016లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు
2019-05-30 20:07:31
కేంద్ర మంత్రిగా మన్సుక్‌భాయ్ దాంజీభాయ్ వసావా
కేంద్ర మంత్రిగా మన్సుక్‌భాయ్ దాంజీభాయ్ వసావా ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1957 జూన్ 1
- స్వస్థలం: గుజరాత్
- విద్యార్హతలు: సామాజిక సేవలో పీజీ
- 1994లో గుజరాత్ మంత్రిగా సేవలు
- 1998లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో జయభేరి
- 2014 నుంచి 2016వరకు కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు
2019-05-30 20:06:39
కేంద్ర మంత్రిగా ప్రహ్లాద్ పటేల్
కేంద్ర మంత్రిగా ప్రహ్లాద్ పటేల్ ప్రమాణ స్వీకారం
- జననం: జూన్ 28, 1960
- స్వరాష్ట్రం: మధ్యప్రదేశ్
- 1999లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- వాజ్‌పేయీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు
- 2014, 2019లో దమోహ్ నుంచి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 20:04:00
కేంద్ర మంత్రిగా కిరణ్ రిజిజు
కేంద్ర మంత్రిగా కిరణ్ రిజిజు ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1971 నవంబర్ 19
- స్వస్థలం: అరుణాచల్‌ప్రదేశ్
- విద్యార్హతలు: న్యాయశాస్త్రంలో పట్టా
- 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2014లో కేంద్ర హోం శాఖకు సహాయ మంత్రిగా సేవలు
2019-05-30 20:01:11
కేంద్ర మంత్రిగా జితేంద్ర సింగ్
కేంద్ర మంత్రిగా జితేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1956 నవంబర్ 6
- స్వస్థలం: జమ్ము
- విద్యార్హతలు: వైద్యశాస్త్రంలో పట్టా
- ఫిజీషియన్‌గా సుదీర్ఘకాలం సేవలు
- 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2014 నుంచి కేంద్రమంత్రిగా సేవలు
2019-05-30 19:57:35
కేంద్ర మంత్రిగా రావ్ ఇంద్రజిత్ సింగ్
కేంద్ర మంత్రిగా రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు
- స్వరాష్ట్రం: హరియాణా
- నియోజకవర్గం: గుడ్‌గావ్
- విద్యాభ్యాసం: ఎల్‌ఎల్‌బీ
- హరియాణా అసెంబ్లీకి నాలుగుసార్లు ఎన్నిక
- 1998లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2004, 2009, 2014, 2019లో లోక్‌సభకు ఎన్నిక
- 2014లో కేంద్రమంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:56:48
కేంద్ర మంత్రిగా సంతోష్ గాంగ్వర్
కేంద్ర మంత్రిగా సంతోష్ గాంగ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1948 నవంబర్ 1
- స్వస్థలం: ఉత్తరప్రదేశ్
- విద్యార్హతలు: బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ
- 1996వరకు బరేలీ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా బాధ్యతలు
- 2009లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2014లో జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు
- 2016 జులై నుంచి 2017 సెప్టెంబర్ వరకు ఆర్థికశాఖ సహాయ మంత్రి
- 2017 సెప్టెంబర్ నుంచి కార్మిక, ఉపాధి కల్పనశాఖ సహాయ మంత్రి
2019-05-30 19:54:26
కేంద్ర మంత్రిగా గజేంద్రసింగ్ షెకావత్
కేంద్ర మంత్రిగా గజేంద్రసింగ్ షెకావత్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1967 అక్టోబర్ 3
- స్వస్థలం: జైసల్మీర్, రాజస్థాన్
- విద్యార్హతలు: ఎంఫిల్
- 1992 నుంచి ఏబీవీపీలో చురుకైన పాత్ర
- 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2017లో వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు
- 2019లో జోధ్‌పూర్ నుంచి లోక్‌సభకు రెండోసారి ఎన్నిక
2019-05-30 19:53:40
కేంద్ర మంత్రిగా గిరిరాజ్ సింగ్
కేంద్ర మంత్రిగా గిరిరాజ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: సెప్టెంబర్ 8, 1952
- స్వస్థలం: బడహియా, బిహార్
- 2002 నుంచి 2014 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు
- 2014లో లోక్‌సభకు ఎన్నిక
- 2014లో కేంద్రమంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:50:13
కేంద్ర మంత్రిగా అరవింద్ సావంత్
కేంద్ర మంత్రిగా అరవింద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1951, డిసెంబర్ 31
- స్వస్థలం: ముంబయి
- రెండుసార్లు మహారాష్ట్ర శాసనమండలికి ఎన్నిక
- 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2019లో దక్షిణ ముంబయి నుంచి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 19:45:27
కేంద్ర మంత్రిగా ప్రహ్లాద్ జోషి
కేంద్ర మంత్రిగా ప్రహ్లాద్ జోషి ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: నవంబర్ 27, 1962
- స్వస్థలం: హుబ్లీ, కర్ణాటక
- 2004, 2009, 2014, 2019లో లోక్‌సభకు ఎన్నిక
- 2012లో కర్ణాటక రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు
2019-05-30 19:43:00
కేంద్ర మంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
కేంద్ర మంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1957 అక్టోబర్ 15
- స్వస్థలం: అలహాబాద్, ఉత్తరప్రదేశ్
- విద్యార్హతలు: మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ
- 1998 ఏడాది తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- వాజ్‌పేయీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా సేవలు
- 2014లో మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి
- అనంతరం మైనార్టీ వ్యవహారాల మంత్రిగా కేబినెట్ హోదా
2019-05-30 19:41:12
కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1969 జూన్ 26
- స్వస్థలం: ఒడిశాలోని తాల్చేర్
- విద్యార్హతలు: ఉత్కల్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఏ
- 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- పలు రాష్ట్రాలకు భాజపా తరఫున ఇన్‌ఛార్జిగా సేవలు
- 2014లో పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:39:34
కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్
కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1964 జూన్ 13
- స్వస్థలం: ముంబయి
- విద్యార్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్, న్యాయశాస్త్రంలో పట్టా
- పలు బ్యాంకుల్లో బోర్డు సభ్యుడిగా సేవలు
- మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నిక
- 2014లో పలు శాఖలకు సహాయ మంత్రిగా సేవలు
- 2017లో రైల్వే మంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:38:01
కేంద్ర మంత్రిగా ప్రకాశ్ జావ్‌డేకర్
కేంద్ర మంత్రిగా ప్రకాశ్ జావ్‌డేకర్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1951 జనవరి 30
- స్వస్థలం: పూణే, మహారాష్ట్ర
- విద్యార్హతలు: బీకాం(ఆనర్స్)
- పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలు
- 2014లో పలు శాఖలకు సహాయ మంత్రిగా బాధ్యతలు
- 2016లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:35:44
కేంద్ర మంత్రిగా హర్షవర్ధన్
కేంద్ర మంత్రిగా హర్షవర్ధన్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1954 డిసెంబర్ 13
- స్వస్థలం: దిల్లీ
- విద్యార్హతలు: వైద్య విద్యలో పట్టా
- 1992లో తొలిసారి దిల్లీ అసెంబ్లీకి ఎన్నిక
- దిల్లీ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు
- 2014 ఎన్నికల్లో చాందీన్‌చౌక్ నుంచి లోక్‌సభకు ఎన్నిక
- 2014లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా నియామకం
- అనంతరం శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:33:49
కేంద్ర మంత్రిగా స్మృతి ఇరానీ
కేంద్ర మంత్రిగా స్మృతి జుబిన్ ఇరానీ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1976 మార్చి 23
- స్వస్థలం: దిల్లీ
- టెలివిజన్ నటిగా దేశవ్యాప్త గుర్తింపు
- క్యూంకీ సాస్ బీ కభీ బహు థీ ధారావాహికతో పేరు
- 2011లో తొలిసారి రాజ్యసభకు నియామకం
- 2014లో అమేఠీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ
- మోదీ ప్రభుత్వంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
- అనంతరం జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు
- సమాచార ప్రసార శాఖామంత్రిగా అదనపు బాధ్యతలు
2019-05-30 19:31:47
కేంద్ర మంత్రిగా అర్జున్ ముండా
కేంద్ర మంత్రిగా అర్జున్ ముండా ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1968 మే 3
- స్వస్థలం: జంషెడ్‌పూర్, ఝార్ఖండ్
- విద్యార్హతలు: డిగ్రీ
- ప్రత్యేక ఝార్ఖండ్ ఉద్యమంలో కీలక పాత్ర
- ఝార్ఖండ్‌కు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:29:21
కేంద్ర మంత్రిగా రమేశ్ పోఖ్రియాల్
కేంద్ర మంత్రిగా రమేశ్ పోఖ్రియాల్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1959 జులై 15
- స్వస్థలం: ఉత్తరాఖండ్
- విద్యార్హతలు: పీహెచ్‌డీ
- 1991లో కర్ణప్రయాగ నియోజకవర్గం నుంచి యూపీ శాసనసభకు ఎన్నిక
- 1993, 1996 ఎన్నికల్లో కూడా యూపీ శాసనసభకు ఎన్నిక
- 1997లో ఉత్తరాంచల్ అభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు
- అనంతరం ఉత్తరాఖండ్ శాసనసభకు రెండుసార్లు ఎన్నిక
- 2009 నుంచి 2011వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు
- 2014లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- 2019లో రెండోసారి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 19:28:36
కేంద్ర మంత్రిగా ఎస్. జయశంకర్
కేంద్ర మంత్రిగా ఎస్. జయశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1955 జనవరి 15
- స్వస్థలం: తమిళనాడు
- 1977లో ఇండియన్ ఫారెన్ సర్వీసుకు ఎంపిక
- 2018వరకు విదేశీ వ్యవహారాలశాఖలో కీలక పదవులు
- చైనా, అమెరికాల్లో భారత రాయబారిగా విధులు
- 2015 నుంచి 2018వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి బాధ్యతలు
- చట్టసభలకు ఎన్నిక కాకుండానే మంత్రివర్గంలో చోటు
2019-05-30 19:28:30
కేంద్ర మంత్రిగా థావర్ చంద్ గహ్లోత్
కేంద్ర మంత్రిగా థావర్ చంద్ గహ్లోత్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1948 మే 18
- స్వస్థలం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని
- విద్యార్హతలు: బీఏ
- 1996లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నిక
- పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలు
- 2014లో సామాజిక న్యాయ, సాధికారతశాఖ మంత్రి
2019-05-30 19:26:26
కేంద్ర మంత్రిగా థావర్ చంద్ గహ్లోత్
కేంద్ర మంత్రిగా థావర్ చంద్ గహ్లోత్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1966 జూలై 25
- స్వస్థలం: పంజాబ్
- విద్యార్హతలు: వస్త్ర డిజైనింగ్‌లో డిప్లొమా
- శిరోమణి అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌తో వివాహం
- 2009లో పంజాబ్‌లోని భటిండా నుంచి లోక్‌సభకు ఎన్నిక
- 2014లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా నియామకం
2019-05-30 19:24:28
కేంద్ర మంత్రిగా హరిసిమ్రత్ కౌర్
కేంద్ర మంత్రిగా హరిసిమ్రత్ కౌర్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1966 జూలై 25
- స్వస్థలం: పంజాబ్
- విద్యార్హతలు: వస్త్ర డిజైనింగ్‌లో డిప్లొమా
- శిరోమణి అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌తో వివాహం
- 2009లో పంజాబ్‌లోని భటిండా నుంచి లోక్‌సభకు ఎన్నిక
- 2014లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా నియామకం
2019-05-30 19:22:01
కేంద్ర మంత్రిగా రవిశంకర్ ప్రసాద్
కేంద్ర మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1954 ఆగస్టు 30
- స్వస్థలం: పట్నా, బిహార్
- విద్యార్హతలు: న్యాయశాస్త్రంలో పట్టా
- పట్నా హైకోర్టు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు
- దాణా కుంభకోణంపై వ్యాజ్యం వేసిన బృందంలో సభ్యుడు
- అయోధ్య భూవివాదంలో రామ్‌లల్లా తరఫున వాదనలు
- 2000ఏడాది తొలిసారి రాజ్యసభకు ఎన్నిక
- వాజ్‌పేయీ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా సేవలు
- పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలు
- మోదీ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ మంత్రి
2019-05-30 19:19:07
కేంద్ర మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్
కేంద్ర మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1957 జూన్ 12
- స్వస్థలం: మధ్యప్రదేశ్
- విద్యార్హతలు: డిగ్రీ
- 2009లో తొలిసారి రాజ్యసభకు ఎన్నిక
- పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలు
- 2014లో ఉక్కుశాఖ మంత్రిగా నియామకం
- 2016 నంచి వేర్వేరు శాఖలకు మంత్రిగా సేవలు
2019-05-30 19:17:21
కేంద్ర మంత్రిగా రాంవిలాస్ పాసవాన్
కేంద్ర మంత్రిగా రాంవిలాస్ పాసవాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1946 జూలై 5
- స్వస్థలం: బిహార్‌లోని సహార్బనీ
- విద్యార్హతలు: న్యాయశాస్త్రంలో పట్టా
- 1977లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక
- తొలిసారి జనతాదళ్ తరఫున హజీపూర్ నుంచి ఎన్నిక
- 2000లో లోక్ జన్‌శక్తి పార్టీ స్థాపన
- ఆరుగురు ప్రధానమంత్రులతో మంత్రిగా విధులు
- 8సార్లు లోక్‌సభకు ఎన్నిక, ఒకసారి రాజ్యసభకు ఎన్నిక
- 2014లో ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:15:35
కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం
కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1959 ఆగస్టు 18
- స్వస్థలం: తమిళనాడు మధురై
- విద్యార్హతలు: జేఎన్‌యూ నుంచి ఎంఫిల్
- ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తొలిసారి ఎన్నిక
- రెండోసారి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక
- 2014లో మోదీ ప్రభుత్వంలో తొలుత సహాయ మంత్రిగా సేవలు
- 2017లో రక్షణ శాఖమంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:14:50
కేంద్ర మంత్రిగా డీవీ సదానంద గౌడ ప్రమాణ స్వీకారం
కేంద్ర మంత్రిగా డీవీ సదానంద గౌడ ప్రమాణ స్వీకారం చేశారు.
- జననం: 1953 మార్చి 18
- స్వస్థలం: సుల్యా తాలుకా మందెకోలు గ్రామం, కర్ణాటక
- విద్యార్హతలు: న్యాయశాస్త్రంలో పట్టా
- తొలుత ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు
- 2004లో కాంగ్రెస్‌నేత వీరప్పమెయిలీపై గెలిచి లోక్‌సభలో అడుగు
- పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా బాధ్యతలు
- 2011లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు
- మోదీ తొలి ప్రభుత్వంలో శాఖలకు మంత్రిగా బాధ్యతలు
2019-05-30 19:14:18
కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1957 మే 27
- స్వస్థలం: నాగ్‌పూర్, మహారాష్ట్ర
- విద్యార్హతలు నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య
- తొలుత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర
- 2009లో భాజపా జాతీయ అధ్యక్షుడిగా నియామకం
- 2014లో నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపు
- 2014 నుంచి ఉపరితల రవాణశాఖ మంత్రి బాధ్యతలు
2019-05-30 19:10:58
కేంద్ర మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్
కేంద్ర మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1951 జూలై 10
- స్వస్థలం: ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా బాబోరా
- విద్యాభ్యాసం: ఎమ్మెస్సీ(ఫిజిక్స్) గోరఖ్‌పూర్ యూనివర్సిటీ
- ఉద్యోగం: బౌతికశాస్త్ర అధ్యాపకుడు, కేబీ పీజీ కళాశాల, మీర్జాపూర్
- 1975లో భారతీయ జన్‌సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక
- 1977లో తొలిసారి యూపీ శాసనసభకు ఎన్నిక
- 1994లో రాజ్యసభకు ఎన్నిక
- 1999లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా సేవలు
- 2000-2002 మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు
- 2003లో కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి బాధ్యతలు
- 2005-2009 మధ్య భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు
- 2014 నుంచి కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు
- రాజ్‌నాథ్ హయాంలోనే జాతీయ రహదారి అభివృద్ధి పథకం ప్రారంభం
- అవిభాజ్య ఉత్తరప్రదేశ్‌కు ఆఖరి ముఖ్యమంత్రి
- ఐరాసలో వాజ్‌పేయీ తర్వాత హిందీలో ప్రసంగించిన రెండో నేత
2019-05-30 19:10:15
కేంద్ర మంత్రిగా అమీత్ షా
కేంద్ర మంత్రిగా అమీత్‌షా ప్రమాణ స్వీకారం చేశారు
- జననం: 1964 అక్టోబర్ 22
- స్వస్థలం: గాంధీనగర్ జిల్లా, గుజరాత్
- విద్యార్హతలు: బయో కెమిస్ట్రీలో బీ.ఎస్సీ
- 1983లో ఏబీవీపీ ప్రతినిధిగా నియామకం
- 1986లో భారతీయ జనతాపార్టీలో చేరిక
- 1997లో గుజరాత్ శాసనసభకు తొలిసారి ఎన్నిక
- 2002లో గుజరాత్ మంత్రిగా బాధ్యతల స్వీకరణ
- 2012వరకు గుజరాత్ శాసనసభకు ప్రాతినిధ్యం
- 2014లో భాజపా జాతీయ అధ్యక్షుడిగా నియామకం
- 2017లో రాజ్యసభ సభ్యుడిగా నియామకం
- దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంలో కీలక పాత్ర
- 2019లో గాంధీ నగర్ నుంచి లోక్‌సభకు ఎన్నిక
2019-05-30 19:03:53
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కో వింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
2019-05-30 19:01:52
బిమ్స్టెక్ దేశాధినేతల హాజరు
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం బిమ్స్టెక్ దేశాల అధినేతలు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, కిర్గిస్థాన్ దేశాధ్యక్షులు అబ్దుల్ హమీద్, మైత్రిపాల సిరిసేన, యు విన్ మియంత్, భూటాన్ ప్రధాని లోటె షీరింగ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, థాయ్‌లాండ్ ప్రత్యేక దూత గ్రిసాద బూన్‌రాచ్, దేశంలోని పలు రాజకీయ పార్టీల ప్రముఖులు ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.
2019-05-30 18:52:48
హాజరైన వ్యాపార, సినీ ప్రముఖులు
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ దంపతులు, రతన్ టాటా హాజరయ్యారు. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ విచ్చేశారు.
2019-05-30 18:43:04
మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత గులాం నబీ అజాద్. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ కూడా వచ్చారు.
2019-05-30 18:36:12
హాజరైన అడ్వాణీ
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భాజపా అగ్రనేత అడ్వాణీ హాజరయ్యారు.
2019-05-30 18:30:57
రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమిత్ షా, ఎంపీలు
రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా, ఎంపీలు.
2019-05-30 18:21:08
ఎంపీలకు ప్రధాని తేనీటి విందు
ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే ముందు కేబినేట్లో చోటు దక్కిన ఎంపీలకు ప్రధాని మోదీ తేనీటి విందు ఇస్తున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 6.30గంటలకు మోదీ, ఎంపీలు రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు. రాత్రి 7గంటలకు రాష్ట్రపతి భవన్ ముందున్న మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై జరిగే కార్యక్రమంలో ప్రధాని, కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2019-05-30 18:18:12
కేంద్ర మంత్రి వర్గంలో వీరు కూడా ..!
- అనుప్రియా పటేల్
- కైలాశ్ చౌదరి
- సంజీవ్ బలియాన్
- దేబాశీష్ చౌదరి
- మన్సుక్ వసావా
- రామేశ్వర్ తెలీ
- సోంప్రకాశ్
- రమేశ్ పోఖ్రియాల్
- గజేంద్ర సింగ్ షెకావత్
- అర్జున్ ముండా
- సాథ్వీ నిరంజన్ జ్యోతి
- వి.కె.సింగ్
- అనురాగ్ ఠూకూర్
2019-05-30 18:16:45
కేబినెట్‌లో వీరికీ అవకాశం
- హర్సిమ్రత్ కౌర్ బాదల్
- థావర్ చంద్ గహ్లోత్
- కిషన్‌రెడ్డి
- పురుషోత్తం రూపాలా
- బాబుల్ సుప్రియో
- డా.జితేంద్ర సింగ్
- సురేశ్ అంగాడి
- ప్రహ్లాద్ జోషి
- ప్రహ్లాద్ పటేల్
- రవీంద్ర నాథ్ (అన్నాడీఎంకే)
- మన్సుక్ మాండవ్యా
- రావ్ ఇందర్జీత్ సింగ్
- కిషన్‌పాల్ గుజ్జర్
2019-05-30 18:04:29
కేబినెట్ మంత్రులు వీరే..!
- రాజ్‌నాథ్ సింగ్
- నితిన్ గడ్కరీ
- సదానంద గౌడ
- అర్జున్ రామ్ మేఘవాల్
- ప్రకాశ్ జావడేకర్
- రాందాస్ అథవాలే
- ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
- సుష్మా స్వరాజ్
- రవిశంకర్ ప్రసాద్
- కిరణ్ రిజిజు
- స్మృతీ ఇరానీ
- నిర్మలా సీతారామన్
- పీయూష్ గోయల్
- రాంవిలాస్ పాసవాన్
- ధర్మేంద్ర ప్రదాన్
- సంతోష్ గాంగ్వర్
2019-05-30 17:52:15
మోదీ నివాసానికి కేబినేట్లో చోటు దక్కిన ఎంపీలు
కేంద్ర కేబినెట్‌లో చోటుదక్కిన ఎంపీలు దిల్లీలోని 7 కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంటున్నారు. పీఎంవో, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చిన నేతలంతా ఒక్కొక్కరుగా చేరుకోవడం వల్ల మోదీ నివాసం వద్ద సందడి నెలకొంది. అమిత్ షాతో పాటు పలువురు ఎంపీలంతా మోదీ నివాసానికి చేరుకున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారికి మోదీ, అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
2019-05-30 17:26:07
కాసేపట్లో మోదీ ప్రమాణ స్వీకారం
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకు అఖండ విజయం సాధించించి పెట్టిన ఆయన.. ప్రధాని పీఠాన్ని రెండోసారి అధిష్ఠించనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్రపతి భవన్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రధాని బాధ్యతలను చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. బిమ్స్టెక్ దేశాధినేతలు, దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన అతిథులు, వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు, భాజపా శ్రేణులు, ఎన్డీఏ నేతలు, కార్యకర్తల నడుమ మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా కాసేపట్లో ప్రారంభం కానుంది. మోదీతో పాటు కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించనున్నారు.