తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"పాక్​కు మిత్రపక్షాలవి"

పట్నాలో జరిగిన సంకల్ప్ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పుల్వామా దాడిలో అమరులైన సైనికుల కుంటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సైనికుల ధైర్యసాహసాలను అభినందించాల్సిన సమయంలో విపక్షాలు వారిని సందేహిస్తున్నాయని ఆరోపించారు మోదీ.

"పాక్​కు మిత్రపక్షాలవి"

By

Published : Mar 3, 2019, 4:08 PM IST

ఒకవైపు భారత సైనికులు ఉగ్రమూకలను తరిమికొట్టే పనిలో నిమగ్నమై ఉంటే... వారి ధైర్యసాహసాలపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బిహార్​ రాజధాని పట్నాలో ఎన్డీఏ నిర్వహించిన సంకల్ప్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తాను ప్రయత్నిస్తుంటే, కొందరు తనను తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ విమర్శించారు.

జైషే ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసిన వాయుసేన ధైర్యసాహసాలను అభినందించకుండా... విపక్షాలు ఆధారాలు అడుగుతున్నాయని మోదీ మండిపడ్డారు.

మెరుపుదాడులపై భాజపా రాజకీయం చేస్తోందని ఆరోపిస్తూ ఇటీవల విపక్షాల కూటమి దిల్లీలో తీర్మానం చేయడాన్ని ప్రధాని తప్పుబట్టారు.

"పాక్​కు మిత్రపక్షాలవి"

"మన దేశ సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్న సమయంలో దేశంలోనే కొంతమంది ఏవేవో పనులు చేస్తున్నారు. సైనికుల శక్తి సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేయాల్సిన సమయంలో వారు చేస్తున్న వ్యాఖ్యలతో శత్రువులు సంబరపడుతున్నారు. ఉగ్రవాదులను తయారు చేస్తున్నవారిపై ఏకమై పోరాడాల్సిన తరుణంలో దిల్లీలో 21 పార్టీలు ఎన్​డీఏ సర్కారుపై నిందలు వేయడానికి కలిశాయి."
--- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ABOUT THE AUTHOR

...view details