తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుల, మత వివక్షలే విపక్షాల ఘనతలు'

ఒడిశాలోని సంబల్​పూర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ  ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకున్న ప్రజాదరణను చూసి మహాకూటమి సభ్యులకు నిద్రపట్టడం లేదని మోదీ ఎద్దేవా చేశారు.

'కుల, మత వివక్షలే విపక్షాల ఘనతలు'

By

Published : Apr 16, 2019, 1:18 PM IST

అవినీతిపై భాజపా చేస్తున్న పోరాటాన్ని సహించలేకే తనను గద్దెదించడానికి మహాకూటమి సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఒడిశాలోని సంబల్​పూర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... కుల, మత వివక్షలే కాంగ్రెస్​, బిజు జనతాదళ్​ పార్టీల ఘనతలని ఆరోపించారు.

ఒడిశా ప్రజల అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేసిందని ప్రధాని గుర్తుచేశారు. ఈసారి రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పేదల కోసం మంజూరు చేసిన నిధులు పూర్తిగా వారికే అందేలా భాజాపా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని మోదీ స్పష్టం చేశారు.

చౌకీదారుకున్న ప్రజాదరణ వల్ల విపక్షాలు నిద్రపోవట్లేదని విమర్శించారు మోదీ.

'కుల, మత వివక్షలే విపక్షాల ఘనతలు'

"మండే ఎండల్లోనూ ఇంత ప్రజాదరణ, ఈ ఉత్సాహాన్ని ప్రసార మాధ్యమాల్లో చూసిన చాలా మందికి నిద్రపట్టడం లేదు. ఈ చౌకీదారును ప్రజలు ఇంతలా ఎందుకు ప్రేమిస్తున్నారనే విషయం మహాకూటమిలోని వారికి అర్థంకావడం లేదు. ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని కోరుకోవడమే ఇందుకు కారణం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. చిట్​ఫండ్​, మైనింగ్​ కుంభకోణాల నిందితులను రక్షిస్తూ ప్రజాభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శిచారు.

ఇదీ చూడండి: 'పాకిస్థాన్​ వెళ్తున్నారా? అయితే ఆలోచించుకోండి'

ABOUT THE AUTHOR

...view details