తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తప్పు చేస్తే మోదీపైనా ఐటీ దాడులు ఖాయం'

అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 'తుగ్లక్ రోడ్ కుంభకోణం' ద్వారా అందిన ముడుపులను రాహుల్ గాంధీ ప్రచారానికి వినియోగిస్తున్నారని  మధ్యప్రదేశ్​లోని సిద్ధి ఎన్నికల సభలో మోదీ ఆరోపించారు.

'తప్పు చేస్తే మోదీపైనా ఐటీ దాడులు ఖాయం'

By

Published : Apr 26, 2019, 3:58 PM IST

విపక్ష నేతలపై మాత్రమే ఐటీ దాడులు జరుగుతున్నాయన్న విమర్శలను ప్రధాని నరేంద్రమోదీ తిప్పికొట్టారు. తప్పుచేస్తే తన ఇంటిలోనూ తనిఖీలు జరపాల్సిందేనని స్పష్టంచేశారు.

మధ్యప్రదేశ్​లోని సిద్ధిలో భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ.

మధ్యప్రదేశ్​లో ప్రభుత్వ పథకాలకు ఉద్దేశించిన సొమ్ము కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారానికి తరలిపోయిందని మరోమారు విమర్శించారు ప్రధాని. దిల్లీలో రాహుల్​ గాంధీ నివాసముండే తుగ్లక్​ రోడ్​ పేరును ప్రస్తావిస్తూ ఈ ఆరోపణలు చేశారు.

'తప్పు చేస్తే మోదీపైనా ఐటీ దాడులు ఖాయం'

"కాంగ్రెస్ నేతలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. దొంగతనం చేసేవారినే పట్టుకుంటారు. దొంగతనం చేసింది కాక దబాయిస్తారా? మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? మేం కాంగ్రెస్ నేతలం. ముఖ్యమంత్రి బంధువులం అని దబాయిస్తారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. మోదీ తప్పు చేసినా ఐటీ శాఖ దాడులు తప్పవు. రెండు పూటలా భోజనం లేకే సైన్యంలో చేరుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారు. ఇది సైన్యాన్ని అవమానించడం కాదా? రాత్రింబవళ్లు కాపలా కాస్తుంటారు. వారి డేగకళ్లతో శత్రు సంచారాన్ని గమనిస్తుంటారు. వారికి భోజనమే కావాలంటే ఏదో ఒక పని చేసుకుని సంపాదించుకుంటారు. సైనికులు తూటా దెబ్బల్ని తినేందుకు వెళ్తారు. భరతమాత కోసం సైన్యంలోకి వెళతారు."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: 'మోదీ బయోపిక్​ విడుదలపై జోక్యం చేసుకోలేం'

ABOUT THE AUTHOR

...view details