తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరివర్తనే నిర్విరామ చౌకీదార్​ లక్ష్యం' - ఆరోపణలు

ఒడిశా ప్రగతి రథం పరుగులు పెట్టేందుకు రాష్ట్రంలోనూ భాజపాకు అధికారం అప్పగించాలని అక్కడి ఓటర్లను కోరారు ప్రధాని నరేంద్రమోదీ. బీజేడీ, కాంగ్రెస్​పై భవానిపట్న సభలో విమర్శలు గుప్పించారు. దేశాభివృద్ధి కోసం తానొక నిర్విరామ కాపలాదారుడిలా పనిచేస్తున్నానని చెప్పారు.

'నేను సేవకుడిని మాత్రమే... మీ ఓటే ముఖ్యం'

By

Published : Apr 2, 2019, 1:21 PM IST

Updated : Apr 2, 2019, 3:32 PM IST

దేశ పరివర్తనే లక్ష్యంగా ఐదేళ్లలో ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా పనిచేశానని చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. 2014 తర్వాత భారత్​లో వచ్చిన మార్పులకు... గత ఎన్నికల్లో ప్రజలు భాజపాను గెలిపించడమే కారణమని అన్నారు.

లోక్​సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే ఒడిశాలోని భవానిపట్నలో ప్రచారం నిర్వహించారు మోదీ. ఒడిశా ప్రగతి రథం రెండు ఇంజిన్లతో పరుగులు పెట్టేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ భాజపాకు అధికారం ఇవ్వాలని అక్కడి ఓటర్లను కోరారు. 2017లో ఉత్తర్​ప్రదేశ్​, 2018లో త్రిపుర శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని ఒడిశాలోనూ పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని మోదీ వివరించారు.

'పరివర్తనే నిర్విరామ చౌకీదార్​ లక్ష్యం'

"దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత 3 వేల గ్రామాలకు చెందిన ఒడిశావాసులకు విద్యుత్​ కనెక్షన్లు వచ్చాయి. విద్యుత్​ అందించే పని ఎవరు చేశారు? ఒడిశాలోని 1 కోటి 40 లక్షల మంది ప్రజలకు ఇప్పుడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల వరకు పేదలు కనీసం బ్యాంకు వైపు చూసేవారే కాదు. మేము 1 కోటి 40 లక్షల మందితో బ్యాంకు ఖాతాలు తెరిపించాం. ఈ పని ఎవరు చేశారు? మీరు మోదీ అంటున్నారు. కానీ మీ సమాధానం తప్పు. ఇది మోదీ చేయలేదు. మోదీ సేవకుడు మాత్రమే. ఈ పనులన్నీ మీరు వేసిన ఓటు వల్లే సాధ్యపడ్డాయి."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

బిజూ జనతా దళ్​, కాంగ్రెస్ వంటి పార్టీలు పేదల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించాయని తీవ్ర విమర్శలు గుప్పించారు మోదీ. ప్రజల కోసం కేంద్రం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా... వాటి అమలుకు ఒడిశా ప్రభుత్వం సహకరించలేదని మండిపడ్డారు.

Last Updated : Apr 2, 2019, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details