తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 'అభినందన'

నిఘంటువులోని పదాలకు అర్థాలు మార్చగల శక్తి సామర్థ్యాలు భారత్​కు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అభినందన్​ను పొగడ్తలతో ముంచెత్తారు ప్రధాని. నిర్మాణ సాంకేతికత సదస్సు-2019 ప్రారంభించిన సందర్భంలో అభినందన్​ను ప్రశంసించారు మోదీ.

By

Published : Mar 2, 2019, 1:50 PM IST

అభినందన్​పై మోదీ ప్రశంసలు

పాక్ చేతికి చిక్కి క్షేమంగా భారత్​ చేరిన వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాల్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్లాఘించారు. అభినందన్ అంటే శుభాకాంక్షలని ప్రస్తుతం ఆ పదానికి అర్థమే మారిపోయిందని దిల్లీలో జరుగుతోన్న నిర్మాణ సాంకేతికత సదస్సు వేదికగా పేర్కొన్నారు.

నిఘంటువులోని పదాలకు అర్థాలు మార్చగల సత్తా భారత్​కు ఉందని మోదీ ఉద్ఘాటించారు. భారత్​ను ప్రపంచం నిశితంగా గమనిస్తోందన్నారు మోదీ.

అభినందన్​ భారత్​కు చేరగానే ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు మోదీ. అభినందన్​ ధైర్యసాహసాలు దేశానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు.

అభినందన్​పై మోదీ ప్రశంసలు

భారత్ ఏం చేసినా ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఈ దేశ సామర్థ్యం నిఘంటువు అర్థాలే మార్చగలదు. అభినందన్​ అంటే శుభాకాంక్షలని అర్థం. ఇప్పుడా పదం అర్థమే మారిపోయింది. అంతటి సామర్థ్యం భారత్​లో ఉంది. విశ్వాసంతో ముందుకెళ్దాం రండి. ఓ వీరోచిత దేశంగా తయారవ్వాలి. కలల్ని సాకారం చేసుకునేందుకు సమయానుగుణంగా ముందడుగు వేయాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. -నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details