తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఇప్పుడు చౌకీదార్ అర్థమేంటో ప్రపంచమంతా తెలిసింది" - chowkidar

దేశవ్యాప్తంగా 'చౌకీదార్' ప్రతిజ్ఞ చేసిన వారితో ఓ ప్రత్యేక ఫోన్​-ఇన్ కార్యక్రమం ద్వారా సంభాషించారు ప్రధాని నరేంద్ర మోదీ. 'చౌకీదార్ చోర్​హై' అంటూ కాపలాదారులను అవమానిస్తున్న ప్రతిపక్షాల తరఫున తాను క్షమాపణలు చెబుతున్నట్లు మోదీ తెలిపారు.

"ప్రపంచమంతా చౌకీదార్ల గురించే మాట్లాడుతోంది"

By

Published : Mar 20, 2019, 10:37 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 'చౌకీదార్' ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. చౌకీదార్​ ప్రతిజ్ఞ చేసిన ​కాపాలాదార్ల కుటుంబసభ్యులతో మాట్లాడారు మోదీ. కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 'చౌకీదార్' అనే పదానికి 'చోర్​' కలిపి కాపలాదారులను అవమానిస్తున్నారని మోదీ ఆరోపించారు.

ప్రత్యేక ఫోన్​-ఇన్ కార్యక్రమం

"మీకందరికీ హోలీ శుభాకాంక్షలు. కాపాలాదార్లతో హోలీ జరుపుకోవడం వల్ల నేను ధన్యుడినయ్యాను. ఎక్కడ చూసినా మీ గురించే చర్చిస్తున్నారు. దేశ విదేశాల్లోనూ కాపాలాదార్ల (చౌకీదార్)​ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలోని అన్ని భాషల వారికి ప్రస్తుతం చౌకీదార్ అనే పదానికి అర్థం తెలిసింది. ఇక చౌకీదార్ అనే పదానికి వారి భాషలో స్థానం కల్పిస్తారేమో. దేశమంతా ప్రస్తుతం 'చౌకీదార్' ప్రమాణం చేస్తోంది. ప్రతి భారతీయుడు 'మై బీ చౌకీదార్' అంటూ నినదిస్తున్నాడు. మీరిచ్చిన ప్రేరణతో ప్రజలు వారి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అందరికంటే ముందు చౌకీదార్లుగా రాత్రింబవళ్లు సేవలందిస్తోన్న సైన్యం, పోలీసులకు క్షమాపణలు తెలుపుతున్నాను. ఎందుకంటే కొంతమంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్నినెలలుగా అనాలోచితంగా ఆరోపణలు చేస్తున్నారు. చౌకీదార్​ను దొంగగా సంబోధిస్తున్నారు."

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ABOUT THE AUTHOR

...view details