తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముడుపుల ఆశతోనే రఫేల్​పై కాంగ్రెస్ రచ్చ :మోదీ - రుద్రాపూర్

రక్షణ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సైన్యానికి కావలసిన అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఉత్తరాఖండ్​లోని రుద్రపూర్​లో జరిగిన బహిరంగసభలో ఆరోపించారు.

కాంగ్రెస్​పై మోదీ విమర్శనాస్త్రాలు

By

Published : Mar 28, 2019, 5:29 PM IST

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్​లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో రక్షణ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఉత్తరాఖండ్​లోని రుద్రపూర్​లో జరిగిన బహిరంగ సభలో ఆరోపించారు.

సైన్యానికి కావలసిన అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విఫలమైందన్నారు మోదీ. కాంగ్రెస్​కు కావలసింది కమీషన్లేనని, జాతీయ భద్రత కాదని తీవ్ర విమర్శలు చేశారు. కమీషన్లు లభించకపోవడం వల్ల రఫేల్ కొనుగోలుకు సరైన సమయం దాటిపోతున్నాపదేళ్ల పాటుచర్చల దశలోనే ఉంచిఒప్పందాన్ని హరించి వేసిందని విమర్శించారు.

రుద్రపూర్​ సభలో మోదీ ప్రసంగం

"సైన్యాధ్యక్షుడిపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైన్యం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మన వద్ద అత్యాధునిక విమానాలున్నాయి. వాటిని కొనుగోలు చేయడం 1980వ దశాబ్దంలో ప్రారంభమయింది. రఫేల్ విమానాల్ని కొనుగోలు చేసేందుకు అటల్​ బిహారీ ప్రభుత్వంలో ప్రయత్నం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ప్రతిపాదన పదేళ్లపాటు అలాగే ఉండిపోయింది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి కమీషన్లు ముట్టలేదు. ఎక్కడి నుంచి కమీషన్లు సేకరించాలన్న సందిగ్ధతలోనే పదేళ్లు గడిచిపోయాయి. మా ప్రభుత్వం వాయుసేన అవసరాలను గుర్తించి ఆ చర్చలను తిరిగి ప్రారంభించింది. మరి కొద్దినెలల్లో రఫేల్ యుద్ధవిమానాలు మన వాయుసేనలో చేరనున్నాయి. మనం అత్యాధునిక హెలికాప్టర్లు వాడుతున్నాం. గతంలో నేలబారు కాంగ్రెస్ ప్రభుత్వం హెలికాప్టర్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడింది. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details