తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పవార్​ పవర్ అంతా చేజారిపోయింది:మోదీ - NCP

ప్రధాని మోదీ, ఎన్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎన్సీపీ ఆధిపత్యం శరద్​ పవార్​ చేతుల్లోంచి జారుతోందని మోదీ విమర్శించారు. ఎన్నికల్లో పరిస్థితులు పవార్​కు అనుకూలంగా లేవని తెలిసే పోటీ చేయట్లేదని ప్రధాని ఆరోపించారు. వర్ధాలో మోదీ సభకు ప్రజలు రాలేదనే నిరాశతోనే పవార్​పై విమర్శలు చేస్తున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్​ స్పందించారు.

పార్టీపై పవార్​ అధిపత్యం తగ్గిపోతోంది

By

Published : Apr 1, 2019, 8:58 PM IST

పార్టీపై పవార్​ అధిపత్యం తగ్గిపోతోంది
ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అంతర్గత విభేదాలతో పార్టీ నియంత్రణ పవార్​ చేతుల్లోంచి అదుపు తప్పుతోందన్నారు. సోమవారం మహారాష్ట్రలోని వర్ధాలో భాజపా-శివసేన సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తెలిసే ప్రస్తుత ఎన్నికల్లో పవార్​ పోటీ చేయట్లేదని ఎద్దేవా చేశారు. ప్రాథమికంగా రైతు అయిన పవార్​... కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని మోదీ ఆరోపించారు.

" పవార్ ప్రధాని కావాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. కానీ, ఉన్నట్లుండి ఒకరోజు తాను రాజ్యసభ ఎంపీగానే ఆనందంగా ఉన్నానని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలిపారు. ఎన్నికల పవనాలు ఎవరివైపు వీస్తున్నాయో పవార్​కూ తెలుసు.
కుటుంబ కలహాలతో ఎన్సీపీ సమస్యలు ఎదుర్కొంటోంది. పార్టీపై పవార్​ ఆధిపత్యం తగ్గిపోతోంది. ప్రస్తుతం పవార్​ సాబ్​ మేనల్లుడు పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించటంలో సమస్యలు తలెత్తాయి."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ప్రధాని విమర్శలపై ఎన్సీపీ స్పందన

ప్రధాని వర్ధా సభకు ప్రజలు రానందునే మోదీ నిరాశకు లోనయ్యారు. అందుకే శరద్ పవార్​పై ఆరోపణలు చేస్తున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్​ స్పందించారు. శరద్​ పవార్​ను ఇప్పటికీ పార్టీ అధినేతగా చూస్తున్నామన్నారు. పవార్​ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని అంటున్న మీరు.. ఐదేళ్ల పాలనలో మోదీ ఏం చేశారని ఎదురు ప్రశ్న వేశారు మాలిక్​.

" ఎల్​ కె అడ్వాణీకి మోదీ ఇచ్చిన గౌరవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆయనను రాజకీయాల్లోకి తెచ్చి, ముఖ్యమంత్రిని చేసిన అడ్వాణీని మోదీ అవమానించారు."
-నవాబ్​ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details