వైరస్‌పై పోరులో.. కఠిన నిర్ణయాలతో కష్టపడ్డ దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా పేదలు తనను మన్నించాలని కోరారు. అయితే.. కరోనా వైరస్‌తో పోరును చావు-బతుకుల పోరాటంగా అభివర్ణించిన మోదీ.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు.
'మనసులో మాట' కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. వైరస్‌ను తొలినాళ్లల్లోనే అరికట్టాల్సిన ఆవ్యశ్యకత ఉందన్నారు. ఇందుకు భారతీయులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
'భయపడాల్సిన అవసరం లేదు..'