దేశంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్ ప్రజలపై జరుగుతున్న దాడుల్ని సమర్థంగా అణచివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. లఖ్‌నవూలో ఇటీవల జరిగిన దాడులను అల్లరిమూకల పనిగా అభివర్ణించారు. దేశ సమగ్రతను కాపాడటం అత్యవసరమని పేర్కొన్నారు మోదీ.
అలాంటి వారి తాట తీయండి: మోదీ - మోదీ
కశ్మీర్ ప్రజలపై జరుగుతున్న దాడుల్ని సమర్థంగా అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
"వీరుల త్యాగాల కారణంగా దేశం సురక్షితంగా ఉంది. అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. కానీ కొంతమందికి ఇది దుఃఖం కలిగిస్తోంది. సైన్యం పరాక్రమాన్ని తగ్గించి చూపేందుకు రాత్రి పగలూ అనే భేదం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు సంతోషం కలిగించే వ్యాఖ్యల్ని చేస్తున్న వారిని క్షమించొచ్చా.. ఇది సైన్యానికి, వీరుల పరాక్రమానికి అవమానం కాదా? రాజకీయ స్వార్థం కోసం విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల వారు ఉపయోగిస్తున్న భాష కారణంగా పాకిస్థాన్‌కు బలం చేకూరుతోంది."-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి