తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జన బలం, ఐక్యతా మంత్రంతో కాశీ బరిలోకి...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్​లోని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు.  ఎన్డీఏ ఐక్యతకు సూచనగా భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు మోదీ నామపత్రాల సమర్పణ కార్యక్రమానికి హాజరయ్యారు.

'వారణాసి'కి మోదీ నామినేషన్​ దాఖలు

By

Published : Apr 26, 2019, 12:04 PM IST

Updated : Apr 26, 2019, 1:57 PM IST

జన బలం, ఐక్యతా మంత్రంతో కాశీ బరిలోకి...

వారణాసి బరిలో రెండోసారి నిలిచారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు.

'ఐక్యతే మా బలం'

మోదీ నామినేషన్​కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు హాజరయ్యారు. భాజపా అధ్యక్షుడు అమిత్​షా, ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్​నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ మోదీ నామినేషన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్, శిరోమణి అకాలీ దళ్ అధినేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్​ సింగ్ బాదల్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాసవాన్, ఏఐఏడీఎంకే నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆద్యంతం ఆధ్యాత్మికం...

నామినేషన్​కు ముందు కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీ.

ఆనాడు అఖండ మెజారిటీ

2014 లోక్​సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మొదటిసారి బరిలో నిలిచారు మోదీ. ఆనాటి ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, ఆమ్​ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్​పై మూడు లక్షల ఓట్లకుపైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున అజయ్​ రాయ్​, బీఎస్పీ నుంచి విజయ్ ప్రకాశ్ జైస్వాల్ పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో కేవలం 70 వేల ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది కాంగ్రెస్.

మరోసారి అజయ్​రాయ్...

వారణాసి బరిలో కాంగ్రెస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిలవనున్నారని కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపించాయి. వాటికి ముగింపు పలుకుతూ అజయ్​ రాయ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేసింది.

Last Updated : Apr 26, 2019, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details